Pithapuram Poling: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఓట్లు వేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. చాలా చోట్ల అర్థరాత్రి దాటేవరకూ క్యూ లైన్లలో నిలబడి ప్రజలు ఓటేశారు. ఏపీ ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పిఠాపురం మున్సిపాలిటీతో పాటు.. కొండెవరం, విరవ, విరవాడ, మల్లం, కందరాడ..గొల్లప్రోలు, చేబ్రోలు, చెందుర్తి, వన్నెపూడి..పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూతుల ముందు క్యూకట్టిన ప్రజలు అర్థరాత్రి దాటేవరకూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పిఠాపురంలో 84.27 శాతం ఓటింగ్ నమోదైంది.
పూర్తిగా చదవండి..Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!
ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది.
Translate this News: