Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

జూన్‌ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని.. జూన్ మొదటివారంలో ఏపీలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని పేర్కొంది.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈరోజు ఆగ్నేయ బంగాళఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల్లోకి (Andaman Nicobar Islands) నైరుతి రుతుపవాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. జూన్‌ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. జూన్ మొదటివారంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రుతుపవనాలు వస్తాయని తెలిపింది. అలాగే జులై 15 నాటికి దేశవ్యాప్తంగా పవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది.

Also read: గుడ్‌న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల

మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. 22న బంగాళఖాతంలో అల్పపీడనం.. 24న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్‌ను చేసింది.

Also Read: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు