Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు!

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గత నాలుగు రోజులుగా ఉక్కబోత, ఎండవేడి తో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Heavy Rain Alert For Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గత నాలుగు రోజులుగా ఉక్కబోత, ఎండవేడి తో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ (IMD) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇక శనివారం నల్గొండ, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఆ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మరోవైపు జూన్ రెండో తేదీన పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించింది.

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళలోకి ప్రవేశించాయి.

మరో రెండు, మూడు రోజుల్లో ఏపీలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వారం, పదిరోజుల్లో తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వానాకాలం సీజన్ ప్రారంభమైనట్లేనని చెప్తున్నారు. అలాగే ఎండలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also read: గూగుల్ లో కొత్త ఫీచర్‌ వచ్చేస్తుంది..ఇక వారందరికీ…!

Advertisment
తాజా కథనాలు