Arvind Kejriwal: రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్‌ సవాల్

ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు మధ్నాహ్నం 12 గంటలకు తమ పార్టీ నేతలందరితో కలిసి బీజేపీ కార్యాలయానికి వస్తామని అన్నారు. ఎవరిని జైల్లో వేస్తారో.. వేయండి అంటూ సవాలు చేశారు.

New Update
CM Kejriwal: త్వరలో ముఖ్యనేతలు అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నేతలందరినీ అరెస్టు చేయమని కేంద్ర ప్రభుత్వానికి సవాలు చేశారు. రేపు మధ్నాహ్నం 12 గంటలకు తమ పార్టీ నేతలందరితో కలిసి బీజేపీ కార్యాలయానికి వస్తామని అన్నారు. ఎవరిని జైల్లో వేస్తారో.. వేయండి అంటూ సవాలు చేశారు. ఇదిలాఉండగా.. ఇటీవల సుప్రీంకోర్టు.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also read: ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే

కేజ్రీవాల్ బయటికి వచ్చిరావడంతోనే బీజేపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని.. వచ్చే ఏడాది నాటికి మోదీ రిటైర్ అవుతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ను కూడా రెండు నెలల్లోనే సీఎం పదవి నుంచి తొలగిస్తారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీలో అమిత్‌ షాకు యోగి అడ్డుగా ఉన్నారని.. అందుకే ఆయనను తప్పిస్తారని అన్నారు. అలాగే.. బీజేపీ అధికారంలోకి వస్తే.. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయ్ విజయన్, తేజస్వీ యాదవ్‌, ఉద్దవ్ ఠాక్రే లాంటి విపక్ష నేతలు కూడా అరెస్టు అవుతారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనం రేపాయి.

Also read: రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్

Advertisment
తాజా కథనాలు