Vitiligo Spots: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా?

బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలతోపాటు వంశపారంపర్యంగా వస్తాయి. చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలతోపాటు హాని కలుగుతుంది. కొన్ని గాయాలు పొడిగా మారి బొల్లికి కారణమవుతాయి. చేపలు, మజ్జిగ తినడం వల్ల బొల్లి వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

Vitiligo Spots: చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తాయా?
New Update

Vitiligo Spots: నిత్యం మనం అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్నింటిని కలిపి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే చేపలు, మజ్జిగ కలిపి తింటే బొల్లి మచ్చలు వస్తుందని చెబుతూ ఉంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం. మజ్జిగ, చేపలు ఆరోగ్యకరం. అయితే ఈ రెండింటినీ కలిపి తింటే హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. చేపలు, మజ్జిగ వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పెరుగు:

  • పెరుగు అనేది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. కిణ్వ ప్రక్రియ సమయంలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అందులో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల అలెర్జీలకు కారణమయ్యే అనేక క్రిములు నాశనం అవుతాయి. అందుకే పాలతో అలర్జీ ఉన్నవారికి కూడా పెరుగు మంచిదని చెబుతారు. చేపలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మజ్జిగ, చేప కలిపి తింటే:

  • నిజానికి మజ్జిగ, చేపలను కలిపి తీసుకుంటే ఎలాంటి హాని ఉండదు. కొన్ని చోట్ల మజ్జిగ లేదా పెరుగుతో చేపల కూర కూడా చేస్తారు. ఇవి తినడం వల్ల బొల్లి వస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

బొల్లి రావడానికి కారణాలు:

  • బొల్లి మచ్చలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది చాలావరకు వంశపారంపర్యంగా వస్తుంది. కొన్ని రసాయనాలు దీనికి కారణమవుతాయి. క్యాన్సర్‌కు చేసే కీమోథెరపీ దీనికి కారణమవుతుంది. అంతేకాకుండా కొన్ని గాయాలు పొడిగా మారి బొల్లికి కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. డెలివరీ తర్వాత ఒత్తిడి కారణంగా, కొంతమంది అమ్మాయిలలో రుతుక్రమం ప్రారంభంలో కొన్ని కారణాల వల్ల బొల్లి వచ్చే అవకాశం ఉంటుంది. చేపలు, మజ్జిగ కలిపి తింటే విరేచనాలు కూడా కావని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: దుప్పట్లు బాగా వాసన వస్తున్నాయా?.. ఈ రెమెడీలు పాటించండి

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #fish #best-health-tips #buttermilk #vitiligo-spots
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe