Sweat Reduction Tips: వేసవిలో ఇంట్లోంచి బయటికి వచ్చిన వెంటనే లేదా ఫ్యాన్ ఆఫ్ చేసిన వెంటనే చెమట పట్టడం ప్రారంభమవుతుంది. చెమట బట్టలను తడి చేయడమే కాకుండా చికాకు కలిగిస్తుంది. ఎండాకాలంలో బయటి నుంచి వచ్చిన వెంటనే ముందుగా స్నానం చేయాలనుకుంటారు. స్నానం చేయడం వల్ల చెమట తగ్గడమే కాకుండా శరీరంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల చెమట పట్టకుండా చేసుకోవచ్చు.
చెమట పట్టడం ఎలా ఆపాలి..?
విపరీతమైన చెమట పట్టకుండా ఉండేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకుంటే దుర్వాసన రాదు. బాక్టీరియాను తొలగించడంలో సహాయపడే కొన్ని సహజ పదార్థాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీరం pH స్థాయిని పెంచి దురద, చెమట నుంచి ఉపశమనం అందిస్తాయి. ఇంటర్నేషనల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీనివేదిక ప్రకారం అధిక చెమట ఉంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం అవసరం. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. వేసవిలో వీలైనంత వరకు కాటన్ దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి. అలసిపోకుండా జాగ్రత్త వహించండి. ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయండి. రోజు మధ్యాహ్నం పని చేయవద్దు.
వేప:
వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడతాయి. నీటిలో వేప ఆకులు లేదా వేపనూనె కలుపుకుని స్నానం చేయవచ్చు. ఇది చర్మంపై దద్దుర్లు, చెమట దుర్వాసన, దురదను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
పసుపు:
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పసుపును నీటిలో కలిపి రాసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది. అంతే కాకుండా చర్మంలో మెరుపు కూడా పెరుగుతుంది. స్కిన్ ట్యానింగ్ నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది.
గులాబీ రేకులు:
స్నానం చేసే ముందు నీటిలో గులాబీ ఆకులను వేయండి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చెమట పట్టకుండా ఉంటుంది. గులాబీ రేకులు చెమట దుర్వాసనను పోగొడతాయని వైద్యులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో ఇలా చేస్తే మీ పెదాలు సేఫ్.. అస్సలు పగలవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.