National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ

వారణాసి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే మోదీ మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత రాయబరేలీను సందర్శించిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలు చేశారు.

National: ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు-రాహుల్ గాంధీ
New Update

Rahul gandhi sensational comments on Modi:  మోదీ, బీజేపీ రాజకీయాలు ప్రజలకు నచ్చడం లేదు. ఈ విషయాన్ని భారత ప్రజలై ఆయన స్వయంగా తెలిపారు. అందుకే వారణాసిలో మోదీకి అంత తక్కువ మెజారిటీ వచ్చిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయబరేలీలో తాను బీజేపీ అభ్యర్ధిని మూడుల లక్షల మెజారిటీతో ఓడించానని..అదే విధంగా ప్రియాంక గాంధీ వారణాసిలో పోటీ చేసి ఉంటే అక్కడ మోదీని కూడా అదే మెజారిటీతో ఓడించి ఉండేదని రాహుల్ అన్నారు. ఎన్నికల తర్వాత రాబరేలీ ప్రజలను కలవడానికి వెళ్ళిన ఆయన అక్కడ ఈ వ్యాఖ్యలను చేశారు.

తాను అహంకారంతో ఈ మాటలు చెప్పడం లేదని..ప్రజలే మోదీ చర్యలు తమకు నచ్చడం లేదని ఈ విధంగా తెలిపారని రాహుల్ గాంధీ అన్నారు. మత ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాను, తమ పార్టీ ఎప్పుడూ నిలబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు.

ఈసారి ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోటీ చేయలేదు. ముందు ఆమె అమేథీ నుంచి పోటీ చేస్తుంది అనుకున్నారు కానీ చివరకు అక్కడ నుంచి కేఎల్ శర్మ పోటీ చేశారు. ఇక రాహుల్ గాంధీ తన తల్లి స్థానమైన రాయబరేలీ నుంచి, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆయన విజయం సాధించారు. అమేథీలో బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీని శర్మ 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడించారు. అన్నంటి కంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది.

Also Read:AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఆహ్వాన పత్రిక ఇదే!

#rahul-gandhi #modi #varanasi #priyanka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe