భారత్లో 2021లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల మీద వాట్సాప్, ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటా పిటిషనల్ దాఖలు చేసింది. మెసేజ్‌లు ఎవరు పంపిస్తున్నారో ట్రేస్ చేసే విధానానికి సంబంధించి నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశాయి. దీని మీద వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిమీద ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మెటా తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తొలగించాల్సి వస్తే భారత్‌లో వాట్సాప్ సేవలను నిలిపివేస్తామని అన్నారు. మా ప్లాట్‌ఫామ్‌లో మేసేజ్‌ల సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాము. దాని కోసమే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానం అవలంబిస్తున్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు భారత్లో పెట్టిన రూల్‌తో మేం బలవంతంగా ఆ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెబితే మేం భారత్ నుంచి వెళ్లిపోతాం అని కోర్టు తెలిపారు.
భారత్‌లో ప్రవేశపెట్టిన 4(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని వాట్పాస్ యాజమాన్యం అంటోంది. ఇది వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకం. అసలు ఏ సోషల్ మీడియాలతో సంప్రదించకుండానే బారత్ ఈ నిర్ణయం తీసుకుందిని అంటోంది మెటా. దీని వల్ల మేం కోట్లాది మెసేజ్‌లను కొన్నేళ్ల పాటు భద్రపర్చాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు’’ అని వాట్సప్ తరఫు కౌన్సిల్ వాదించింది. ఈ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తర్వాతి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
అంతకుముందు 2021 ఫ్రిబ్రవరిలో భారత కేంద్రం కొత్త ఐటీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం సోసల్ మీడియాలో ఏ వ్యక్తికీ భద్రత ఉండదు. ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతుంది. ఫేస్‌బుక్, ఇన్ట్సా, ట్విట్టర్ల లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు అన్నీ వీటిని తప్పక పాటించాలని చెప్పింది. అయితే వీటిని సోషల్ మీడియా మొత్తం వ్యతిరేకించింది. దీని మీద దేశ వ్యాప్తంగా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. రీసెంట్‌గానే వీటన్నింటినీ సుప్రీంకోర్టు డిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.
Also Read:Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఎక్కడనుంచైనా జనరల్ టికెట్