Ice Cubes: ముఖంపై మచ్చలు వేధిస్తున్నాయా?.. నిమ్మ ఐస్‌ క్యూబ్స్‌ ట్రై చేయండి

జన్యు, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమల సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జిడ్డు చర్మం, మొటిమలతో తరచూ ఇబ్బంది పడుతుంటే.. వాటిని తగ్గించేందుకు నీమ్‌ ఆకులతో చేసిన ఐస్‌ క్యూబ్స్‌ ఉపయోగపడతాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
Ice Cubes: ముఖంపై మచ్చలు వేధిస్తున్నాయా?.. నిమ్మ ఐస్‌ క్యూబ్స్‌ ట్రై చేయండి

Ice Cubes: జిడ్డు చర్మం, మొటిమలతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. చర్మాన్ని కాపాడుకోవడానికి రకరకాల సన్‌ క్రీమ్స్‌, ఆయిల్‌ కంట్రోల్‌ క్రీములను వాడుతుంటారు. వీటిని వాడినా కొన్నిసార్లు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇంట్లోనే కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల సులభంగా మొటిమలు పోగొట్టుకోవడంతో పాటు చర్మాన్ని కూడా మెరిసేలా చేసుకోవచ్చు. ముఖంపై మచ్చలు, మొటిమలను పోగొట్టడానికి నీమ్‌ ఆకులతో చేసిన ఐస్‌ క్యూబ్స్‌ ఎంతగానే ఉపయోగపడతాయి.

మొటిమలు ఎందుకు వస్తాయి?

  • జన్యు, హార్మోన్ల మార్పుల వల్ల మొటిమల సమస్య కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖంపై నూనె ఎక్కువగా రావడం, చర్మ రంధ్రాలు మూసుకుపోయి అందులో బ్యాక్టీరియా పెరగడం వల్ల మొటిమలు ఏర్పడతాయి.

నీమ్ ఐస్ క్యూబ్ ప్రయోజనాలు:

1.మొటిమలను గిల్లినప్పుడు గోర్లు గీసుకుని వాపుతో పాటు గాయాలు కూడా అవుతుంటాయి. అలాంటి పరిస్థితిలో ముఖం మీద నీమ్ ఐస్ క్యూబ్ ఉంచవచ్చు.
2.నీమ్‌ ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. ముఖం నుంచి వాపు, ఎరుపును తగ్గిస్తాయి.
3. ఐస్ క్యూబ్ విషయానికొస్తే చల్లని ఉష్ణోగ్రత రక్త నాళాలను కదిలిస్తుంది. దీని వల్ల మొటిమలతో పాటు మంట కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నీమ్‌ ఐస్‌ క్యూబ్స్‌ చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.
4. ముఖంపై నీమ్ ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.

నీమ్ ఐస్ క్యూబ్‌కి కావాల్సినవి:

  • తాజా నీమ్ ఆకులు- 10-15
  • నీరు- సరిపడా
  • తేనె- 1 టీస్పూన్ లేదా కలబంద జెల్ 1 టీస్పూన్

నీమ్ ఐస్ క్యూబ్ తయారీ పద్ధతి:

  • మొదట నీమ్ ఆకులను నీటితో కడగాలి. ఆ తర్వాత నీటిలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తేనె లేదా కలబంద గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసి 4 గంటల పాటు డీఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత తయారైన నీమ్ ఐస్ క్యూబ్‌ని తీసుకుని ముఖంపై రెండు నిమిషాలు మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: చిరునవ్వులు చిందిస్తూ అయోధ్య రాముడి దర్శనం..సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు