ICC World Cup Tickets: వరల్డ్‌కప్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. క్షణాల్లోనే సైట్ క్రాష్ భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. By BalaMurali Krishna 26 Aug 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC World Cup 2023 Tickets: భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ (BCCI) ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ వరల్డ్‌కప్ టికెట్లను బుక్ మై షో (Book My Show) యాప్, వైబ్‌సైబ్ ద్వారా విక్రయిస్తున్నారు. 35-40 నిమిషాల పాటు సైట్ క్రాష్.. వార్మప్ మ్యాచ్‌లతో సహా ఇతర దేశాల మ్యాచ్‌ల టికెట్లను శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి విక్రయించడం మొదలుపెట్టారు. అంతే టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడి మరి సైట్ ఓపెన్ చేశారు. దీంతో యాప్, వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు సైట్ పని చేయలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన నెటిజన్లు.. సైట్ క్రాష్ అయిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అసహనం వ్యక్తం చేశారు. ఇతర దేశాల మ్యాచ్‌ల టికెట్లకు సైట్ క్రాష్ అయితే.. ఇక టీమిండియా ఆడే మ్యాచుల టికెట్స్ విక్రయాలు ప్రారంభిస్తే పరిస్థితి ఏంటనే కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 30 నుంచి భారత్ ఆడే మ్యాచులకు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. Also Read: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ఫైర్.. ఎందుకుంటే.! ఏ తేదీల్లో టికెట్ల విక్రయాలు జరగనున్నాయంటే..? ఆగస్టు 25: భారత్ కాకుండా ఇతర అన్ని జట్లు ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్లు విక్రయాలు జరిగిపోయాయి. ఆగస్టు 30: గువాహటి, త్రివేండ్రం స్టేడియంలలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల లభ్యం ఆగస్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణే నగరాల్లో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల లభ్యం సెప్టెంబర్ 1: ముంబయి, లక్నో, ధర్మశాలలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల లభ్యం సెప్టెంబర్ 2: బెంగళూరు, కోల్‌కతాలో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల లభ్యం సెప్టెంబర్ 3: అహ్మదాబాద్‌లో భారత్ ఆడే మ్యాచ్‌ల టికెట్ల లభ్యం సెప్టెంబర్ 1: వరల్డ్‌కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్ల లభ్యం అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్.. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీన డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభంకానుంది. ఇక యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు, నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. అయితే ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. భారత్, పాక్ మ్యాచ్ సహా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 14కి మార్చిన సంగతి తెలిసిందే. Also Read: గాయంతో ఉండగానే సెలక్ట్ చేస్తారా? అసలు మైండ్ ఉందా? మాజీ క్రికెటర్ ఫైర్! #cricket #bcci #icc #book-my-show #icc-world-cup-2023-tickets #world-cup-2023-tickets #website-crashed-due-to-heavy-traffic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి