ICC World Cup Tickets: వరల్డ్కప్ అంటే ఆ మాత్రం ఉంటది మరి.. క్షణాల్లోనే సైట్ క్రాష్
భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లను దేవుళ్లగా కొలుస్తూ ఉంటారు. ఇక అందులోనూ వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీ జరగనుందంటే అభిమానులకు పూనకాలే. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభకానున్న మ్యాచ్ టికెట్ల విక్రయాలను బీసీసీఐ ప్రారంభించింది. ఇలా సేల్స్ ప్రారంభించిందో లేదో క్షణాల్లో అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది.