Cricket: ఆ విషయంలో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడు.. రవిశాస్త్రి ఏం చెప్పాడో వినండి!

టెక్నిక్‌పరంగా క్రికెట్‌లో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడన్నాడు రవిశాస్త్రి. సచిన్‌ బ్యాటింగ్‌లో ఉండే ప్యూరిటీ మరే ఇతర క్రికెటర్ల బ్యాటర్లలో కనిపించదన్నాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, బౌన్సీ ట్రాక్‌, టర్నింగ్ ట్రాక్‌ ఏదైనా కావొచ్చని సచిన్‌కు వీక్‌ జోన్‌ లేదని కొనియాడాడు.

Cricket: ఆ విషయంలో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడు.. రవిశాస్త్రి ఏం చెప్పాడో వినండి!
New Update

క్రికెట్‌లో సచిన్(Sachin) రికార్డులు బద్దలవుతూ ఉండొచ్చు.. ఈ జనరేషన్‌ పిల్లలు సచిన్‌ ఆట చూసి ఉండకపోవచ్చు.. కానీ నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. ఎవరూ ఔనన్నా కాదన్నా సచిన్‌ సచినే. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు టీమిండియా మాజీ ప్లేయర్‌, భారత్‌ మాజీ కోచ్‌ రవిశాస్త్రి(Ravi Shastri). ఓవైపు విరాట్‌కోహ్లీ(Virat kohli), రోహిత్ శర్మ(Rohit sharma) ఇద్దరూ సచిన్‌ రికార్డులు బద్దలు కొడుతున్న వేళ రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. రవిశాస్త్రి మాటలతో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ వాన్‌ ఏకీభవించాడు.



రవి ఏం అన్నాడంటే:

టెక్నిక్ పరంగా సచిన్‌ని మించిన ప్లేయర్‌ ప్రపంచంలోనే లేడన్నాడు రవిశాస్త్రి. టెక్నికలీ గిఫ్టెడ్‌ బ్యాటర్‌ ఎవరని తనని అడగితే తనకు ముందుగా గుర్తొచ్చే బ్యాటర్‌ సచినేనన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్, వాన్ క్లబ్ ప్రైరీ ఫైర్ కోసం పోడ్‌కాస్ట్‌లో కనిపించారు. ఈ పోడ్‌క్యాస్ట్ సందర్భంగా రవిశాస్త్రి సచిన్‌ ఎలాంటి ప్లేయరో చెప్పుకొచ్చాడు. ఏ ఫార్మెట్‌లోనైనా సచిన్‌ గొప్ప ప్లేయర్‌ అని.. కన్సిస్‌టెంట్‌గా గేమ్‌ను అడాప్ట్, అడ్జస్ట్ చేసుకున్న ప్లేయర్‌ సచిన్‌ అని చెప్పాడు. బ్యాటింగ్‌లో నిండుతనాన్ని, ప్యూరిటీని తీసుకొచ్చిన ఆటగాడు సచిన్‌ అని కొనియాడాడు.



టెక్నిక్‌లో సచిన్‌కు సాటి రారు:

భారీగా పరుగులు చేసేవారు, వేగంగా రన్స్ చేసే ప్లేయర్లు దొరుకుతారు కానీ.. టెక్నిక్‌ విషయానికి వస్తే సచిన్‌ అందరికంటే ఎత్తులో ఉంటాడని.. అతని క్రికెట్‌ షాట్లు ఆడడం చాలా సహజంగా వచ్చినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, బౌన్సీ ట్రాక్‌, టర్నింగ్ ట్రాక్‌ లేదా అది వన్డే క్రికెట్, టెస్టులు లేదా టీ20లు కావచ్చు.. సచిన్‌ సంచలనాలు సృష్టించాడు. ఇవన్నీ అతనికి సహజంగా వచ్చాయి. అతని ఆట, అతని టెక్నిక్ గురించి నేను చాలా మందిలో చూడని స్వచ్ఛత కనిపిస్తుందని ప్రశంసించాడు. ఇక వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ సచినే. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. నవంబర్‌ 16, 2013న అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ వీడ్కోలు పలికాడు.



Also Read: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్‌ గణాంకాలు..!

WATCH:

#virat-kohli #icc-world-cup-2023 #sachin-tendulkar #ravi-shastri
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe