Virat Kohli: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్ గణాంకాలు..! 2011,2015, 2019 ప్రపంచకప్ సెమీస్‌లలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ మూడు సెమీస్‌లు కలిపి కోహ్లీ చేసింది 11 పరుగులే. దీంతో ఈ సెమీస్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడోనన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. By Trinath 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023 India vs Newzealand semis: ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా నుంచి కోహ్లీనే టాప్ రన్ గెటర్. మరో 80 రన్స్ చేస్తే వరల్డ్‌కప్ హిస్టరీలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. 2003 ఎడిషన్‌లో సచిన్ 673 రన్స్ చేశాడు. ఇక రేపు(నవంబర్ 15) ముంబై వేదికగా టీమిండియా, భారత్ మధ్య ఫైట్ జరగనుంది. వరల్డ్‌కప్‌లో జరగనున్న ఈ తొలి సెమీస్ మ్యాచ్‌కు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో అందరిచూపు కోహ్లీపై పడింది. మరో సెంచరీ చేస్తే వన్డేల్లో 50 శతకాలు సాధించిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. కానీ సెమీస్‌కు ముందు కోహ్లీకి ఉన్న ఓ చెత్త రికార్డు ఫ్యాన్స్‌ను కలవర పెడుతోంది. Virat Kohli during today's net session 😭#INDvsNZ pic.twitter.com/ftqYIfDbzz — Krishna (@sigmakrixhna) November 14, 2023 సెమీస్‌లో దారుణ రికార్డులు: ఇప్పటివరకు కోహ్లీ మూడు సార్లు వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. కనీసం సింగిల్ డిజిట్ మార్క్ కూడా దాటలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 11 రన్స్ చేశాడు. అత్యధిక స్కోరు 9. 2011 ప్రపంచకప్ సెమీస్‌లో పాకిస్థాన్‌పై 9 రన్స్ చేశాడు కోహ్లీ. వహబ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సెమీస్‌లో కేవలం ఒక్క పరుగుకే వెనుతిరిగాడు కోహ్లీ. జాన్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 2019 ప్రపంచకప్ సెమీస్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో బౌల్ట్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలా మూడు సార్లు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లకే కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు. Virat Kohli playing switch hit shot in today's practice session at Wankhede. pic.twitter.com/0VXNGr4avF — CricketMAN2 (@ImTanujSingh) November 14, 2023 ఈసారి అలా జరగదు: నిజానికి తన కెరీర్లో కోహ్లీ ఫామ్ కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువ. టెస్టుల్లో కాస్త డీలా పడ్డాడు కానీ.. వన్డేల్లో కోహ్లీ ఎప్పుడూ కింగే. అయితే సెమీస్‌లో మూడుసార్లు ఫెయిల్ కోహ్లీ అవ్వడం ఫ్యాన్స్‌ను ఆందోళన పెట్టే అంశం. ఈ వరల్డ్‌కప్‌లో మాత్రం కోహ్లీ సెమీస్‌లో రాణిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కోహ్లీ భీకరంగా ఉంది. కివీస్‌పై మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తాడని అంచనాలు కూడా ఉన్నాయి. మ్యాచ్ జరగనున్న వాంఖడే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే అంతకంటే గొప్ప ఆనందం ఇండియన్స్‌కు మరొకటి ఉండదు. Also Read: ‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్ WATCH: #virat-kohli #india-vs-new-zealand #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి