దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకోని జట్టులోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా స్పీడ్‌స్టర్ బుమ్రా చెలరేగిపోతున్నాడు. ఐర్లాండ్‌పై సిరీస్‌లో రాణించి వరల్డ్‌కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. బుమ్రా భారీగా రన్స్ ఇవ్వడమో లేదా ఫెయిల్ అవ్వడమో లాంటివి ఫ్యాన్స్ చూసి ఏళ్లు దాటిపోయాయి. అటు బుమ్రాకు ప్రస్తుత క్రికెట్‌లో ఎవరైనా పోటి ఉన్నాడా అంటే కొంతమంది పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది పేరు చెబుతారు. పాక్ క్రికెట్ ఫ్యాన్స్ షాషీనే బెస్ట్ అని అభ్రిపాయపడుతుంటారు. అయితే ఈ డిబెట్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు పాక్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్
బుమ్రానే బెస్ట్:
బుమ్రా వర్సెస్ షాహీన్ అఫ్రిది... ప్రస్తుత జనరేషన్‌లో ఎవరూ బెస్ట్ బౌలర్? అన్నదానిపై వసీం తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. నిచ్చెనలో అందరికంటే టాప్‌లో బుమ్రా ఉన్నాడని తేల్చేశాడు. ప్రపంచంలో అత్యుత్తమ పేసర్ బుమ్రానేనని వసీం చెప్పాడు. ఇంత స్థిరంగా బౌలింగ్ చేయగలిగిన బౌలర్ ఇతర జట్లలో లేరన్నాడు వసీం. నియంత్రణ, పేస్, వైవిధ్యాలు.. ఇది బుమ్రాకు సాధ్యమని.. అందుకే అతను కంప్లీట్ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌ను చూస్తే ముచ్చటెస్తుందని.. పేస్, క్యారీ, ఫాలో-త్రూ.. ఇలా ఎందులోనైనా బుమ్రాను కొట్టే బౌలర్ లేరని చెప్పాడు వసీం.
బ్యాటర్లను ముప్పుతప్పలు పెడతాడు:
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు బాల్ చేసేటప్పుడు ఓవర్ ది వికెట్ నుంచి వచ్చే బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూసి చాలా మంది ఇన్‌స్వింగ్ వేస్తున్నాడని భావిస్తారని.. అయితే అతను అనూహ్యంగా అవుట్ స్వింగ్ వేస్తాడని.. ఇది బ్యాటర్లు పసిగట్టలేకపోతారన్నారు వసీం. కొత్త బంతితో కంట్రోల్‌గా బౌలింగ్ చేసేవారిలో బుమ్రా ఫస్ట్ అని అభిప్రాయపడ్డాడు వసీం. ఇక పాకిస్థాన్ క్రికెటర్లు టెస్టు క్రికెట్ ఎక్కువగా ఆడలేరని.. బుమ్రా మాత్రం ఏ ఫార్మెట్‌లోనైనా స్థిరంగా బౌలింగ్ చేయగలడన్నాడు వసీం. కొత్త బంతితో బుమ్రా తనకంటే మంచి బౌలర్ అని ఆకాశానికి ఎత్తేశాడు వసీం.
Also Read: స్టేడియానికి పోటెత్తనున్న 70 వేల విరాట్ కోహ్లీలు.. ఏంటి నమ్మడం లేదా?