IND vs AUS: 1983-2023 మధ్య బంగారం ధర కన్నా వందల రెట్లు పెరిగిన టీమిండియా ప్లేయర్ల విలువ!

1983లో టీమిండియా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్‌కు రూ.1,500 జీతం తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కో వన్డే మ్యాచ్‌కు భారత్ క్రికెటర్లు రూ.6లక్షల జీతం తీసుకుంటున్నారు. అటు టెస్టులకు అయితే ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ఆటగాడికి రూ.15లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.

New Update
IND vs AUS: 1983-2023 మధ్య బంగారం ధర కన్నా వందల రెట్లు పెరిగిన టీమిండియా ప్లేయర్ల విలువ!

ICC WORLD CUP 2023: దేశంలో క్రికెట్‌ ఫీవర్‌ పీక్స్‌కు వెళ్లింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్ జరగనుండగా.. యావత్‌ దేశం రేపటి మ్యాచ్‌ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అటు సోషల్‌మీడియాలోనూ, సెర్చ్‌ ఇంజిన్లలోనూ అభిమానులు క్రికెట్‌ వార్తల కోసం ఫుల్‌గా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్లేయర్ల ప్రైజ్ మనీ, మ్యాచ్‌ ఫీజ్‌ లాంటివాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 1983లో తొలిసారిగా ఇండియా వరల్డ్‌కప్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే.. కపీల్‌దేవ్‌ కెప్టెన్సీలో ఇండియా విశ్వవిజేతగా ఆవర్భవించింది. మరి అప్పటి టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ ఎంతో తెలుసా?

1983లో మ్యాచ్‌ ఫీజ్‌ ఎంతంటే?
అప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి.. 1983లో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ రూ.1,500 అని 'CricTracker' నివేదించింది. భారత ఆటగాళ్లు ఒక్కో వన్డేకు రూ. 1,500 మ్యాచ్ ఫీజు తీసుకున్నారు . దీంతో పాటు రూ. 200 రోజువారీ అలోవెన్స్‌ ఉంటుంది. ప్రపంచ కప్ గెలిచిన మూడు నెలల తర్వాత టీమిండియా ఆటగాళ్ల ప్లే స్లిప్‌ ఒకట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ టీమ్‌లో కపిల్ దేవ్, సందీప్ పాటిల్, మదన్ లాల్, మొహిందర్ అమర్‌నాథ్, బల్వీందర్ సంధు, యశ్‌పాల్ శర్మ, శ్రీకాంత్, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మాణి, కీర్తి ఆజాద్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ వాల్సన్ ఉన్నారు. ప్రముఖ పాత్రికేయుడు మకరంద్ వైగాంకర్, సెప్టెంబర్ 21, 1983న జరిగిన వన్డే మ్యాచ్‌కు సంబంధించిన పే షీట్‌ను బయటపెట్టారు.

ఇప్పుడెంతో తెలుసా?
2023లో ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఒక్కో వన్డే మ్యాచ్‌కు రూ.6లక్షల ఫీజ్‌ తీసుకుంటున్నారు. ఒక్కో టెస్టులకు రూ.15 లక్షలు, టీ20లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.3 లక్షలు చెల్లిస్తారు. ఇక అలోవెన్స్‌లు కూడా ప్రస్తుత జట్టుకు గట్టిగానే ఉన్నాయి. బీసీసీఐ ఎంత్ రిచ్‌గా ఎదిగిందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌ ఇది. నేడి భారత్‌ క్రికెట్‌ బోర్డు ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోంది. ఐసీసీ కూడా బీసీసీఐ చెప్పిందే వింటుందన్నది బహిరంగ రహస్యమే. ఇక 1983లో 10గ్రాములు బంగారం ధర 1,800 ఉండగా.. ప్రస్తుతం 10గ్రాముల గోల్డ్ ధర 58 వేలగా ఉంది. అదే సయయంలో టీమిండియా మ్యాచ్ ఫీజ్ విలువ మాత్రం ఈ 40ఏళ్లలో వేల రెట్లు పెరిగింది. ఇక రేపు(నవంబర్‌ 19) అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌కు వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్స్‌ రారున్నారు. వారిని సన్మానించనున్నారని సమాచారం.

Also Read: క్రికెట్ ఫైనల్స్ ఫీవర్..విమానం టికెట్ రేట్ల రాకెట్ స్పీడ్..లక్షల్లో హోటల్ గది..

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు