Diwali 2023: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

టీమిండియా అభిమానులకు భారత్‌ జట్టు దీపావళి రోజు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు అందించింది. బ్రాడ్‌మన్‌ రికార్డును గవాస్కర్‌ సమం చేయడం, హీరో కప్‌ సెమీస్‌లో సచిన్‌ బౌలింగ్‌, ధోనీ 183 రన్స్‌తో పాటు పాక్‌పై టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ 82 రన్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

New Update
Diwali 2023: దీపావళి రోజు పేలిన టీమిండియా టపాసులు.. మరిచిపోలేని జ్ఞాపకాలు..!

దీపావళి(Diwali) వచ్చిందంటే చాలు దేశం అంతటా ఆనందంలో మునిగిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఫెవరేట్ పండుగ. అటు క్రికెట్ అభిమానులకు కూడా దీపావళితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పండుగ టైమ్‌లో టీమిండియా ఖాతాలో ఎన్నో అద్భుతమైన విజయాలు ఉన్నాయి. నాటి గ్రేట్‌ బ్యాటర్‌ గవాస్కర్‌(Sunil gavaskar) నుంచి నేటి రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) వరకు అభిమానులు గుర్తుపెట్టుకున్న మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని మ్యాచ్‌లపై ఓ లుక్కేయండి.

గవాస్కర్:
క్రికెట్‌లో సచిన్‌కు ముందు భారత్‌లో అత్యుత్తమ గ్రేట్ బ్యాటర్‌ గవాస్కర్‌. సచిన్‌ కంటే ముందు ఎన్నో క్రికెట్‌ హిస్టరీలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. క్రికెట్‌ లెజెండరీ బ్యాటర్‌ డాన్‌ బ్రాడమన్‌ చేసిన 29 సెంచరీల రికార్డును గవాస్కర్‌ దీపావళి రోజే సమం చేశాడు. 1983లో అక్టోబరు 29 -నవంబర్ 3 మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ గవాస్కర్ వీరవిహారం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కపిల్ దేవ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ తరఫున క్లైవ్ లాయిడ్ 103 పరుగులు చేశాడు.

సచిన్:
2004 టెన్నిస్‌ ఎల్బో గాయానికి ముందు సచిన్‌(Sachin Tendulkar) టీమిండియాకు ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. చాలా సార్లు బంతితోనూ భారత్‌ను గెలిపించాడు. అందులో అన్నిటికంటే ఎక్కువగా అభిమానులు చర్చించుకునే ఘటన 1993లో జరిగింది. 1993 హీరో కప్ సెమీ-ఫైనల్‌లో టీమిండియా సౌతాఫ్రికాపై ఆడింది నవంబర్ 24న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్‌ బంతితో అద్భుతమే చేశాడు. లాస్ట్‌ ఓవర్‌తో దక్షిణాఫ్రికా విన్‌ అవ్వాలంటే 6 రన్స్ చేయాలి. కెప్టెన్‌ అజార్‌ సచిన్‌కు బంతి ఇవ్వడంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే వారి ఆశ్చర్యం ఆనందంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సచిన్‌ ఆఖరి ఓవర్‌లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు బెర్త్ బుక్ చేసుకుంది.

ధనా ధన్‌ ధోనీ:
అక్టోబరు 31, 2005.. ఈ డేట్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ధోనీ(Dhoni) తన ప్రతాపం చూపించిన రోజు ఇది. దీపావళికి మహేంద్రుడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. జైపూర్‌ గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే బాంబులు పేల్చాడు ధోనీ. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన కెరీర్‌లో అత్యుత్తమ వన్డే నాక్ ఆడాడు. శ్రీలంక విధించిన 299 టార్గెట్‌ని ఇండియా ఈజీగా ఛేజ్‌ చేసి పడేసింది. 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులతో అద్బుతంగా మ్యాచ్‌ను మలుపు తిప్పిన ధోనీ పేరు ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. 10 సిక్సర్లు,15 ఫోర్లతో ధోనీ గ్రౌండ్‌లోనే థౌజండ్‌ వాలా పేల్చడంతో భారత్ 3.5 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేజ్ చేసింది. టార్గెట్‌ కొంచెం ఎక్కువ ఉండి ఉంటే అప్పుడే తొలి డబుల్ సెంచరీ నమోదై ఉండేది.

కోహ్లీ.. టాప్‌ క్లాస్‌ ఛేజింగ్‌:
ఛేజింగ్‌లో కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టు గెలిచినట్టు ఎప్పుడూ అనుకోదు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను కూడా గెలిపించే సత్తా కోహ్లీది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ టీ20 అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి. దీపావళికి రెండు రోజలు క్రితం అక్టోబర్‌ 23న జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ ఓడిపోతుందని పాక్‌ అభిమానులు భావించారు. అయితే 53 బంతుల్లో 82 రన్స్ చేసిన కోహ్లీ పాండ్యాతో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఇక రేపు(నవంబర్ 11) దీపావళి రోజు నెదర్లాండ్స్‌(Netherlands)తో వరల్డ్‌కప్‌(World cup 2023) మ్యాచ్‌ ఉండడంతో కోహ్లీ వన్డేల్లో 50వ సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

Also Read: బేబీ బంప్ తో అనుష్క శర్మ..నెట్టింట్లో వీడియో వైరల్.!

WATCH: 

Advertisment
Advertisment
తాజా కథనాలు