IND vs NZ: టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్‌లో ఆ స్టార్ బౌలర్!

ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్‌ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

New Update
IND vs NZ: టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్‌లో ఆ స్టార్ బౌలర్!

Ind vs NZ World Cup 2023: ప్రపంచకప్‌లో భాగంగా రెండు టాప్‌ టీమ్స్ మధ్య రేపు(అక్టోబర్ 22)న మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటివరకు ఓటమే ఎరగని రెండు జట్లు ఇండియా, న్యూజిలాండ్‌ రేపు తలపడనున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడగా రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించాయి. రెండు టీమ్‌లకు 8 పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్‌రన్‌రేట్‌ మాత్రం కివీస్‌కు (New Zealand) కాస్త ఎక్కువగా ఉండడంతో అది నంబర్-1 పొజిషన్‌లో ఉంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్‌లతో పాటు సౌతాఫ్రికాకు మాత్రమే టోర్నీలో పాజిటివ్‌ నెట్‌రన్‌రేట్ ఉంది. మిగిలిన జట్లు నెగిటివ్‌ రన్‌రేట్‌తో ఉన్నాయి. ఇక రేపటి మ్యాచ్‌కు టీమిండియా (India) కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది.

publive-image గత మ్యాచ్ లో గాయపడ్డ పాండ్యా(ఫైల్)

పాండ్యా లేడు:
బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గాయపడ్డాడు. బౌండరీ ఆపే క్రమంలో పాండ్యాకు లెగ్‌ స్లీప్‌ అయ్యింది. దీంతో రేపటి మ్యాచ్‌కు పాండ్యా  ఆడడం లేదు. రేపటి మ్యాచ్‌ ధర్మశాలలో జరగనుండగా.. పాండ్యా అక్కడికి చేరుకోలేదు. పాండ్యా కాకుండా మిగిలిన ప్లేయర్లు ఫ్లైట్ ఎక్కి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. పాండ్యా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లడం లేదని, చికిత్స కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడని సమాచారం. అయితే న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు మాత్రమే పాండ్యా దూరంగా ఉండే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌ సమయానికి పాండ్యా జట్టులో చేరే ఛాన్స్ కనిపిస్తోంది. నిజానికి ధర్మశాల ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. దీంతో కీలక మ్యాచ్‌కు ముందు పాండ్యా గాయపడడం టీమిండియాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి..

publive-image శార్దూల్‌ ఠాకూర్‌ (ఫైల్)

పాండ్యా స్థానంలో ఎవరంటే:
పాండ్యా ఆడకపోవడంతో అతని స్థానంలో షమిని (Shami) తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేంటి షమి బౌలర్ కదా అని ఆశ్చర్యపోవద్దు. న్యూజిలాండ్‌పై టీమిండియా కొత్త స్ట్రాటజీతో బరిలోకి దిగుతోంది. పాండ్యా ప్లేస్‌లో షమిని ఆడించి.. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ని బ్యాటింగ్‌లో ముందుకు ప్రొమోట్ చేస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి శార్దూల్‌ ఠాకూర్‌(Shardul Thakur) బౌలరే కానీ తక్కువ కాలంలోనే మంచి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతనికి బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ట్యాగ్‌ ఉంది. ధర్మశాల పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుండడంతో ఈ మ్యాచ్‌లో షమిని కూడా ఆడించి కివీస్‌ బ్యాటర్లకు చెక్‌ పెట్టవచ్చని టీమిండియా భావిస్తున్నట్టు సమాచారం.

Also Read: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..!

Advertisment
తాజా కథనాలు