ICC WORLD CUP 2023 FINAL: ఇండియా ఫైనల్ ఓడిపోవడం ఏమో కానీ.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సెటైర్లు పేల్చుతోంది. నవంబర్ 19న అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో మోదీ రావడం వల్లే ఓడిపోయాం అని కాంగ్రెస్ సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తోంది. రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో ఇదే రచ్చ. మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు టీమిండియా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
రాహుల్ గాంధీ ఏం అన్నారంటే?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని జలోర్‌కు ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమిపై వ్యాఖ్యలు చేశారు. 'మా అబ్బాయిలు ప్రపంచకప్ గెలిస్తే బాగుండేదని, పనౌటి(మోదీ) మాత్రం మమ్మల్ని ఓడిపోయేలా చేశారని' రాహుల్ అన్నారు. బహిరంగ సభలో మోదీని టార్గెట్ చేశారు రాహుల్. ఇంతలో బహిరంగ సభలో కొందరు 'పనౌటీ పనౌటీ' అంటూ నినాదాలు చేశారు. మన కుర్రాళ్లు ప్రపంచకప్ గెలచేవారని.. మోదీ ఓడిపోయేలా చేశారని సెటైర్లు వేశారు. మీడియా ఇలా చెప్పదని.. కానీ ప్రజలకు ఈ విషయం తెలుసని కౌంటర్లు వేశారు. దీంతో సభలో ఉన్నావారంతా ఒక్కసారిగా నవ్వారు.
గతంలోనూ అంతే జరిగిందా?
నిజానికి ఈ పనోటీ ట్యాగ్ చంద్రయాన్-2 టైమ్‌లో వచ్చింది. చంద్రయాన్-2 తుది మెట్టుపై బోల్తా పడిన విషయం తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో చంద్రయాన్-2 జాబిల్లిపై కాలు మోపే క్షణాలను వీక్షించడానికి మోదీ స్వయంగా సైంటిస్టులతో కలిసి కూర్చున్నారు. కానీ ఆఖరి నిమిషంలో చంద్రయాన్-2 జాబిల్లిపై అడుగుపెట్టలేకపోయింది. కనెక్షన్‌కట్ అయ్యింది. దీంతో నాటి ఇస్రో చైర్మన్ శివన్‌ను మోదీ ఓదార్చగా.. మోదీ ప్రత్యక్షంగా వీక్షించడం వల్లే మిషన్ ఫెయిల్ అయ్యిందని కాంగ్రెస్ సెటైర్లు వేసంది. వారి సెటైర్లకు బలం చేకూర్చుతూ వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ ఇండియా ఓడిపోయింది. అందుకే రాహుల్ గాంధీ ఈ విధంగా కామెంట్స్ చేశాడని ప్రజలు సరదాగ చర్చించుకుంటున్నారు.
Also Read: ‘ఆస్ట్రేలియా టీమ్‌తో కనెక్ట్ ఐపోయా ..’ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!
WATCH: