Rahul Kohli: ఓడిపోవడానికి అదే కారణం.. వారిలో ధైర్యం లేదు.. గంభీర్ ఘాటు విమర్శలు! వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు. By Trinath 22 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC WORLD CUp 2023: వరల్డ్‌కప్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇప్పటికీ అభిమానులు మాత్రం ఓటమి బాధ నుంచి బయటకు రాలేకపోతున్నారు. సెమీస్‌లోనే ఓడిపోయి ఉంటే అంత బాధ అనిపించి ఉండేది కాదేమో కానీ తుది మెట్టుపై బోల్తా పడడంతో ఫ్యాన్స్ ఈ శాడ్‌నెస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు ఓటమికి కారణాలేంటన్న దానిపై ఇంకా ఎన్‌కౌంటర్ సాగుతూనే ఉంది. ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలోనైనా తనదైన శైలిలో స్పందించే గౌతమ్ గంభీర్(Gautham Gambhir) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే నైజం ఉన్న గంభీర్ మరోసారి అదే చేశాడు. రాహుల్, కోహ్లీని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించాడు. ఫాస్ట్‌గా ఆడాల్సింది: ఇదేం 90వ దశకం కాదు.. 240 పరుగులతో సరిపెట్టుకోవడానికి.. గెలవాలంటే 300 పరుగులు చేయాలి.. అంతకంటే తక్కువ చేస్తే అనవసరం. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు గౌతీ. మూడు వికెట్ల పడిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ అప్రోచ్‌పై నిప్పులు చెరిగాడు. అంత స్లోగా ఆడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. 10-40 ఓవర్ల మధ్య టీమిండియా బౌండరీలు సాధించడంలో విఫలమైందని విమర్శించాడు. అగ్రెసివ్‌గా అటాకింగ్ చేయాల్సిన చోట కూడా స్లోగా బ్యాటింగ్ చేశారని.. ఇదే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. ఓడినట్లు అంగీరించినట్లు ఆడారు: వేగంగా పరుగులు చేస్తే 150 రన్స్‌కి ఆలౌట్ అయ్యేవారని కొంతమంది చెబుతున్నారని.. 150కు ఆలౌటైనా 240 పరుగులు చేసినా ఓటమి ఖాయమే కదా అని ప్రశ్నించాడు గంభీర్. 300 పరుగులు చేస్తేనే గెలుస్తామని తెలిసినిప్పుడు ఆ ప్రయత్నం చేయకుండా ఆడడం ఓడిపోవడంతో సమానమే కదా అని చెప్పాడు. 'కోహ్లీ(Kohli) ఇన్నింగ్స్‌ను యాంకరింగ్ చేసే పాత్రను పోషించాడు, కానీ మిగిలిన వారందరూ దూకుడుగా ఉండాలి. కేఎల్ అటాకింగ్ చేయాలి. మనం ధైర్యంగా ఉంటే 310 పరుగులు చేసేవాళ్లం. అప్పుడు భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఉండేది. ఇది 1990 దశకం కాదు. 240 అస్సలు మంచి స్కోరు కాదు. మీకు 300 ప్లస్ స్కోరు అవసరం. భారత్ అంత ధైర్యంగా లేదు' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. #INDvsNZ #WorldCup2023 @klrahul Can we take a beat and appreciate KL Rahul's contribution in the series with the gloves. #KLRahul pic.twitter.com/nGJWosUms2 — Samskie (@sameer_sapaliga) November 16, 2023 Also Read: టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికినట్లేనా? వన్డే కెప్టెన్సీ కూడా వదులుకుంటాడా? WATCH: #virat-kohli #cricket #gambhir #india-vs-australia #kl-rahul #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి