World Cup: మరువలేని జ్ఞాపకాలు.. 'ధోనీ...' చెవుల్లో ఇంకా మోగుతున్న రవిశాస్త్రి కామెంటరీ!

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోనీ విన్నింగ్‌ సిక్సర్ కొట్టిన తర్వాత రవిశాస్త్రి కామెంటరీని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ రవి కామెంటరీ బాక్స్‌లో ఉంటారు. దీంతో అదే సీన్‌ రిపీట్‌ అవ్వాలని యావత్‌ దేశం కోరుకుంటోంది.

New Update
World Cup: మరువలేని జ్ఞాపకాలు.. 'ధోనీ...' చెవుల్లో ఇంకా మోగుతున్న రవిశాస్త్రి కామెంటరీ!

ఏప్రిల్‌ 02, 2011..
వేదిక- వాంఖడే స్టేడియం..
వరల్డ్‌కప్‌ ఫైనల్‌
ఇండియా వర్సెస్ శ్రీలంక
28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ధోనీ కొట్టిన ఆ విన్నింగ్‌ సిక్సర్‌ అభిమానుల కళ్లలో ఇంకా కదలాడుతూనే ఉంది. 'Dhoni finishes off in style. A magnificent strike into the crowd! India lift the World Cup after 28 years..!' ధోనీ సిక్స్‌ కొట్టిన వెంటనే రవిశాస్త్రి చెప్పిన ఈ కామెంటరీని సగటు భారత్‌ క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పటికీ చెవుల్లో రవిశాస్త్రి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోసారి అదే రిపీట్ అవుతుందా?

12ఏళ్లు గడిచాయి.. భారత్‌ క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. దిగ్గజ క్రికెటర్లు రిటైరయ్యారు.. 2011 ప్రపంచకప్‌లో ఆడిన సచిన్‌, యువరాజ్‌, ధోనీ, జహీర్‌, సెహ్వాగ్‌, గంభీర్‌..ఇలా అందరూ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. నాటి టీమ్‌లోనూ ప్రస్తుత టీమ్‌లోనూ ఉన్న ఆటగాళ్లలో కోహ్లీ, అశ్విన్‌ ఉన్నారు. కోహ్లీ వయసు 35ఏళ్లు. మరో వరల్డ్‌కప్‌ ఆడుతాడా అంటే అనుమానమే. అప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ.. ఇలా అభిమానులు ఎప్పటికప్పుడూ తమ హీరోల కోసం పూజలు చేస్తుంటారు. నాటి ఫైనల్‌లో జట్టును గెలిపించినా ధోనీ పాత్రను ఈ సారి రోహిత్‌ పోషిస్తాడని అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కెప్టెన్సీలో ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. ఇటు బ్యాటింగ్‌లో సచిన్‌, కోహ్లీకి చెప్పలేనని పోలికలు ఉన్నాయి. అటు బౌలింగ్‌లో నాటి జహీర్‌, నేటి షమీకి కూడా అనేక పోలికలున్నాయి. 2011 వరల్డ్‌కప్‌లో భారత్‌ తరుఫున సచిన్‌ టాప్‌ రన్‌ గెటర్‌గా నిలవగా.. ఇటు కోహ్లీ అందరికంటే ఎత్తులో ఉండటమే కాకుండా..ఈ వరల్డ్‌కప్‌లో టాప్‌ రన్‌ గెటర్‌ బ్యాటింగ్‌ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. నాడు జహీర్‌ టాప్‌ వికెట్ టేకరైతే.. ఇప్పుడు షమీ టాప్‌ వికెట్ టేకర్.. ఇలా ఆ జట్టుకు ఈ జట్టుకు ఎన్నో పోలికలున్నాయి.

12ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ సాధించాలని.. క్రికెట్‌ విశ్వవిజేతగా నిలవాలని యావత్‌ దేశం కోరుకుంటోంది. వాంఖడేలో జరిగిందే.. మోదీ స్టేడియంలోనూ జరగాలని ఆశిస్తోంది. అది కూడా అదే రవిశాస్త్రి కామెంటరీ బాక్స్‌లో ఉన్నప్పుడు జరగితే ఇక అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.. కొన్ని వాయిస్‌లను మరిచిపోలేము.. రవిశాస్త్రి వాయిస్‌ అలాంటిదే.. మరోసారి అదే రిపీట్ అవ్వాలని టీమిండియాకు RTV ఆల్‌ ది బెస్ట్ చెబుతోంది.

Also Read: దేవుడి వల్ల కూడా కాలేదు.. రోహిత్‌ సాధిస్తాడా? హిట్‌మ్యాన్‌ని ఊరిస్తోన్న మరో రికార్డు!

Advertisment
తాజా కథనాలు