IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్‌సింగ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక నవంబర్‌ 19న జరగనున్న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New Update
IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!

ICC WORLD CUP 2023: వరల్డ్‌కప్‌(World Cup)లో ఫైనల్‌(Final) మ్యాచ్‌ గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రపంచకప్ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఓటమే ఎరగని జట్టుగా టీమిండియా(India) సెమీస్‌లో అడుగుపెడితే అటు ఆస్ట్రేలియా(Australia) కాస్త పడుతూ లేస్తూ ఒక్కసారిగా దూకుతూ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైనల్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం సాధ్యంకాదు.. ఎందుకంటే రెండు జట్లలోని ఆటగాళ్ల టాలెంట్‌ తిరుగులేనిది. దీంతో హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఇదే సమయంలో గతంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌పై అభిమానులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై గతంలో జరిగిన మ్యాచ్‌లను గుర్తు చేసుకుంటున్నారు.

అతడే హీరో:
ఇప్పటివరకు ఐసీసీ నాకౌట్లలో ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగుసార్లు గెలిచింది. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నది ఒక్కడే కావడం విశేషం. అతనే సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌(Yuvraj singh). 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఇండియా గెలవగా.. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సచిన్(Sachin Tendulkar) అవార్డు అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఐసీసీ నాకౌట్‌లలో గెలిచిన మూడు సార్లు కూడా యువరాజే హీరో. ప్రతీసారి కంగారులను కంగారు పెట్టించాడు యువీ. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై యువీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా.. ఇక 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై యువీ ఆడిన గేమ్‌ను అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 70 రన్స్ చేసిన యువరాజ్‌ ఆస్ట్రేలియాను దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించాడు.

ఇంటికి పంపాడు:
1999,2003,2007 ప్రపంచకప్‌ల్లో హ్యాట్రిక్‌ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు 2011లో మాత్రం క్వార్టర్స్‌లోనే వెనుతిరిగింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 260 రన్స్ చేసింది. కెప్టెన్ పాంటింగ్‌ సెంచరీతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో సెహ్వాగ్‌ వికెట్‌ను త్వరగానే కోల్పోయినా సచిన్‌, గంభీర్‌ హాఫ్‌ సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఇద్దరూ ఔటైన తర్వాత రైనా, యువరాజ్‌ జట్టును గెలిపించారు. 65 బంతుల్లో 57 పరుగులు చేశాడు యువీ.. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. ఇక నవంబర్‌ 19న జరగనున్న మ్యాచ్‌లో యువరాజ్‌ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం

WATCH:

Advertisment
తాజా కథనాలు