ICC World Cup 2023: ఐసిసి వరల్డ్ కప్ టోర్నమెంట్ పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆయా దేశాలు తమ ప్లేయర్స్, టీమ్స్‌ని ప్రకటించేశాయి. ప్రపంచ కప్ కొట్టేందుకు ప్లేయర్స్ సైతం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ కప్ వేదికపై తమ సత్తాని చాటేందుకు ఆయా దేశాల టీమ్స్ సంసిద్ధమయ్యాయి. అయితే, ప్రపంచ కప్‌లో ఆటగాళ్లు తాము నిలకడగా రాణించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీలక ప్లేయర్స్ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..
1) సచిన్ టెండూల్కర్ (భారతదేశం)
భారత బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ టెండూలర్కర్.. వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యా్ట్స్‌మెన్‌గా నిలిచారు. 45 మ్యాచ్‌లు, 44 ఇన్నింగ్స్‌లలో.. 56.95 సగటుతో, 88.98 స్ట్రైక్ రేట్‌తో 2,278 పరుగులు చేశాడు. తన వరల్డ్ కప్ కెరీర్‌లో 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. టోర్నీలో అత్యుత్తమ స్కోరు 152. సచిన్ ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు కూడా చేశాడు. టోర్నమెంట్ 1996, 2003 ఎడిషన్లలో వరుసగా 523 పరుగులు, 673 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. 2003లో టెండూల్కర్ చేసిన 673 పరుగులే టోర్నీలో ఒక ఎడిషన్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు.
2) రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియన్ సూపర్ ప్లేయర్, మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత రికీ పాంటింగ్ 46 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడాడు. 45.86 సగటుతో 1,743 పరుగులు చేశాడు. 79 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. రికీ పాంటింగ్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 42 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌పై 140* పరుగుల అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు.
3) కుమార సంగక్కర (శ్రీలంక)
దిగ్గజ శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర.. తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో, కవర్ డ్రైవ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రికెట్ల ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నా. 37 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో సంగక్కర 56.74 సగటుతో, 86.55 స్ట్రైక్ రేట్‌తో 1,532 పరుగులు చేశాడు. సంగక్కర తన వరల్డ్ కప్ కెరీర్‌లో 5 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలను చేశారు. అత్యుత్తమ స్కోరు 124.
4) బ్రియాన్ లారా (వెస్టిండీస్)
'ది ప్రిన్స్ ఆఫ్ ట్రినిడాడ్' గా గుర్తింపు పొందిన లారా.. వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో కొంత వ్యక్తిగత కీర్తిని పొందాడు. 34 WC మ్యాచ్‌లలో 42.24 సగటుతో 86 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. మొత్తం 1,225 పరుగులు చేశాడు. లారా 33 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 7 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 116. 5
5. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)
2007 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి.. 'మిస్టర్ 360' తన అదిరిపోయే బ్యాటింగ్ స్టైల్‌తో తదుపరి మూడు ఎడిషన్‌లకు ప్రపంచ కప్‌లో నిప్పులు చెరిగారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌లో 23 మ్యాచ్‌లలో డివిలియర్స్ 117 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 63.52 సగటుతో 1,207 పరుగులు చేశాడు. డివిలియర్స్ అత్యుత్తమ స్కోరు 162*. డివిలియర్స్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు సాధించాడు.
6) క్రిస్ గేల్ (వెస్టిండీస్)
'యూనివర్స్ బాస్' క్రికెట్ అభిమానులను ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తాడు. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను, టీవీల ముందు మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు అస్సలు బోర్ కొట్టనివ్వడు. ప్రపంచ కప్ కెరీర్‌లో 35 మ్యాచ్‌లు, 34 ఇన్నింగ్స్‌లలో గేల్ 35.93 సగటుతో, 90.53 స్ట్రైక్ రేట్‌తో 1,186 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 215, ఇది మొదటి ప్రపంచ కప్ డబుల్ సెంచరీ.
7) సనత్ జయసూర్య (శ్రీలంక)
హార్డ్-హిట్టింగ్ శ్రీలంక ఆల్ రౌండర్ 1996 ప్రపంచ కప్ గెలిచిన లంక లయన్స్ జట్టులో స్టార్ ప్లేయర్. 38 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో, జయసూర్య 34.26 సగటుతో, 90.66 స్ట్రైక్ రేట్‌తో 1,165 పరుగులు చేశాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 6 అర్ధశతకాలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 120.
8) జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
ఇతర ప్రసిద్ధ ఆటగాళ్ల మాదిరిగానే, దిగ్గజ దక్షిణాఫ్రికా ఆల్-రౌండర్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 36 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 32 ఇన్నింగ్స్‌లలో 45.92 సగటుతో, 74.40 స్ట్రైక్ రేట్‌తో 1,148 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ కెరీర్‌లో 128* అత్యుత్తమ స్కోరుతో ఒక సెంచరీ మరియు 9 అర్ధసెంచరీలు కూడా చేశాడు.
9) షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
బంగ్లాదేశ్‌కు వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ట్రాక్ రికార్డ్ లేనప్పటికీ.. షకీబ్, జట్టు స్టార్ ఆల్ రౌండర్ టాప్ టెన్ స్కోరర్‌లలో ఒకడు. 29 WC మ్యాచ్‌లలో 45.84 సగటుతో, 82 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1,146 పరుగులు చేశాడు. 29 ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యుత్తమ స్కోరు 124*. అతని 2019లో షకీబ్ 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 606 పరుగులు చేశాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌లలో ఒకటి.
10) తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)
డాషింగ్ శ్రీలంక ఓపెనర్ 2007 నుండి 2015 వరకు మూడు ప్రపంచ కప్‌లలో ఆడాడు. వరల్డ్ టోర్నమెంట్‌లలో 27 మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్.. 52.95 సగటుతో 1,112 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 92 కంటే ఎక్కువగా ఉంది. దిల్షాన్ తన వరల్డ్ కప్ కెరీర్‌లో 4 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 25 ఇన్నింగ్స్‌లలో, అత్యుత్తమ స్కోరు 161*. దిల్షాన్ 2011 ప్రపంచ కప్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 500 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Also Read: