T20 World Cup: మహిళల టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి ఏర్పాట్లు చేస్తోంది ఐసీసీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఈ టోర్నీ జరగనుంది. అంతకు ముందు దీన్ని బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ పరస్తుతం అక్కడ పరిస్థితులు అంతబాగా లేవు. ఈమధ్యనే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇంకా పరస్థితులు చక్కబడలేదు. అందుకే వుమెన్స్ వరల్డ్‌కప్ టోర్నీని యూఏఈకి షిఫ్ట్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 20వరకు టీ20 రల్డ్‌కప్ జరగనుంది. మొదటి మ్యాచ్‌ను బంగ్లాదేశ్, స్కాట్ లాండ్‌లు ఆడనున్నాయి.
ఇక గ్రూప్ ఏలో ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఉండనున్నాయి. గ్రూప్ బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఇంకా దక్షిణాఫ్రికా ఉన్నాయి. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగే టోర్నీలో భారత మహిళల జట్టు తన పోటీను ప్రారంభించనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. అక్టోబరు 9న శ్రీలంకతో మూడో మ్యాచ్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత అక్టోబర్ 13న చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Also Read: Jammu-Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు..కాంగ్రెస్–ఎన్‌సీ ఒప్పందం