T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. జూన్ 5న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్ తో తలపడనుంది.

New Update
T20 World Cup : టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది..జూన్ 9న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్

 World Cup Schedule : టీ20 2024 వరల్డ్ కప్(T20 World Cup) షెడ్యూల్ వచ్చేసింది. జూన్‌ 5న బార్బడోస్‌లో ఐర్లాండ్‌(Ireland) తో టీమ్ ఇండియా(Team India) తమ మొదటి మ్యాచ్ ను ఆడనుంది. అలాగే జూన్ 9న నూయార్క్‌ లో తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్(Pakistan) తో భారత జట్టు మ్యాచ్ ఆడుతుంది. టీమ్ ఇండియా మొదట యూఎస్ఏలో జరిగే గ్రూప్ గేమ్‌లను ఆడాల్సి ఉంటుంది. దీని తర్వాత వెస్టీండీస్‌లో జరిగే సూపర్ 8 మ్యాచ్‌లను ఆడుతుంది. అక్కడ క్వాలిఫై అయితే తరువాత మ్యాచ్‌లకు భారత జట్టు అర్హత సాధిస్తుంది.

Also read:జనవరి 22న అయోధ్యలో వెలగనున్న భారీ దీపం

గ్రూప్ స్టేజ్ గేమ్స్ లో చివరి మ్యాచ్‌ను టీమ్ ఇండియా యూఎస్ఏతో తలపడుతుంది. జూన్ 12న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇది కూడా న్యూయార్క్ వేదికగానే జరగనుంది. భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తేదీలు ఇలా ఉన్నాయి.
జూన్ 5న భారత్ వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)(New York)
జూన్ 9న భారత్ వర్సెస్ పాకిస్థాన్ (న్యూయార్క్)
జూన్ 12న భారత్ వర్సెస్ అమెరికా (న్యూయార్క్)
జూన్ 15న భారత్ వర్సెస్ కెనడా (ఫ్లోరిడా)

ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్ ఫైనల్ బార్బడోస్‌లో జరిగే అవకాశం ఉందని చెబుతోంది ఐసీసీ. ఈమ్యాచ్ జూన్ 29న జరగనుంది.

Advertisment
తాజా కథనాలు