IBPS Jobs: 8వేలకు పైగా జాబ్స్‌ అప్లైకు మరికొద్ది గంటలే సమయం.. త్వరపడండి!

వివిధ పోస్టులకు ఐబీపీఎస్(IBPS) విడుదల చేసిన నోటిఫికేషన్లుకు సంబంధించి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌కి ఇవాళే(ఆగస్టు 28) లాస్ట్ డేట్. 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,451 పీఓ(PO) పోస్టులు, 3,049 MT, 1402 ఎస్‌ఓ(SO) ఉద్యోగాలను ఐబీపీఎస్‌ భర్తీ చేయనుంది. ఇంకా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు ibps.in లో అప్లై చేసుకోవచ్చు.

New Update
Jobs Alert: నిరుద్యోగులూ బీఅలర్ట్...ఈ వారం అప్లయ్ చేసుకోవల్సిన జాబ్స్ ఇవే..!!

IBPS PO SO Registration closes today: బ్యాంక్‌ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వారందరికి ఇదే అలెర్ట్. మరికొద్ది గంటలే సమయం.. అప్లై చేయని వారు త్వరగా చేసుకోండి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ (CRP) ఎంపిక కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ విండో క్లోజ్‌ అవ్వనుంది. PO/MT 2023తో పాటు స్పెషలిస్ట్ ఆఫీసర్ (IBPS SO 2023)కు ఇవాళే(ఆగస్టు 28) లాస్ట్ డేట్. ఇంకా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు ibps.in లో అప్లై చేసుకోవచ్చు. ఐబీపీఎస్ 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,451 పీఓ(PO) పోస్టులు, 3,049 MT, 1402 ఎస్‌ఓ(SO) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎస్‌వో కేటగిరీలో ఆరు రకాల పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రధానంగా అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I) 500, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I) 31, ఐటీ ఆఫీసర్ (స్కేల్-I) 120, లా ఆఫీసర్ (స్కేల్-I) 10, మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-I) 741 ఖాళీలు భర్తీ చేస్తారు. ఈ మూడు కలిపితే దాదాపు 8వేలకు పైగా పోస్టులున్నట్టు లెక్క!

➼ అటు పీఓ(PO) అభ్యర్థుల ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా జరుగుతుంది. ఐబీపీఎస్‌(IBPS) PO ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 5న జరుగుతుంది. ఐబీపీఎస్‌(IBPS) SO ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 30, 31 జరుగుతుంది.ఐబీపీఎస్‌ ఇంతకుముందు PO,SO కోసం దరఖాస్తుల సమర్పణ చివరి తేదీని పొడిగించింది. ముందుగా, దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 21గా ప్రకటించింది. తర్వాత మరో వారం రోజులు పొడిగించింది.. అది ఇవాళ్టితో ముగియనుండగా.. అసక్తి ఉన్న ఎవరైనా అప్లై చేయనివారు చేసుకోవచ్చు.

➼ ఎలా దరఖాస్తు చేయాలి?
➊ IBPS అధికారిక వెబ్‌సైట్, ibps.in ని విజిట్ చేయండి

➋ 'IBPS PO, SO రిజిస్ట్రేషన్' అని ఉన్న నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

➌ ముందుగా మీ వివరాలను నమోదు చేసుకోండి

➍ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, అప్లికేషన్‌ని కంటిన్యూ చేయండి

➎ అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి

➏ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి, దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి

➐ భవిష్యత్ సూచన కోసం ఐబీపీఎస్‌ (IBPS) PO, SO నమోదు దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి

దరఖాస్తు రుసుము:
జనరస్ క్యాటగిరి : రూ.850
(SC, ST, PwD) : రూ.175

➼ ఐబీపీఎస్‌ PO శాలరీ: ప్రొబేషనరీ ఆఫీసర్‌కు అందించే ప్రారంభ జీతం ప్యాకేజీ రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. డియర్‌నెస్ అలవెన్సులు, ప్రత్యేక అలవెన్సులు, HRA, ఇతర పెర్క్‌లు ఉంటాయి.

➼ ఐబీపీఎస్‌ 'పీఓ'తో మాములుగా ఉండదు బ్రదర్:

ప్రొబేషనరీ ఆఫీసర్‌తో కెరీర్ గ్రోత్‌ కూడా ఉంటుంది. ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా మంచి అవకాశాలను ఉంటాయి ప్రమోషన్‌ను పొందేందుకు అభ్యర్థి ఎప్పటికప్పుడు ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షలకు హాజరు కావాలి.

1. మిడిల్ మేనేజర్ – మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 2
2. సీనియర్ మేనేజర్ – మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 3
3. చీఫ్ మేనేజర్ – సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 4
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – సీనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 5
5. డిప్యూటీ జనరల్ మేనేజర్ – టాప్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 6
6. జనరల్ మేనేజర్ – టాప్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ 7
7. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
8. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

ALSO READ:రూ.2,18,200 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. డిటైల్స్‌ చెక్ చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు