IBPS Results: 5,650 క్లర్క్ పోస్టులకు రిజల్ట్స్ రిలీజ్.. మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే?
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ(IBPS RRB) క్లర్క్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు IBPS అధికారిక సైట్ ibps.in ద్వారా రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు . ఐబీపీఎస్ ఆర్ఆర్బీ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16న జరగనుంది. ప్రిలిమ్స్ స్కోర్లు సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 15 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.