IBPS Jobs: ఐబీపీఎస్‌ PO,SO జాబ్స్‌కి దరఖాస్తు గడువు పొడిగింపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే?

ఐబీపీఎస్‌ బ్యాంక్‌ జాబ్స్‌ ప్రిపేర్‌ అయ్యేవాళ్లకి కీలక అప్‌డేట్ ఇది. ఐబీపీఎస్‌ SO, PO ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు గడువు నిన్నటి(ఆగస్టు 21)తో ముగియగా.. ఈ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 28వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రొబేషనరీ ఆఫీసర్ జీతం నెలకు రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రతినెలా రూ.38,000 నుంచి రూ.39,000 వరకు సంపాదించుకోవచ్చు.

New Update
IBPS Jobs: ఐబీపీఎస్‌ PO,SO జాబ్స్‌కి దరఖాస్తు గడువు పొడిగింపు.. లాస్ట్‌ డేట్‌ ఎప్పుడంటే?

IBPS PO Recruitment 2023: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్(PO)/ మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌ డేట్‌ని పొడిగించారు. అభ్యర్థులు ఈ పరీక్షలకు ఆగస్టు 28 వరకు నమోదు చేసుకోవచ్చు. నిజానికి దరఖాస్తు గడువు ఆగస్టు 21(నిన్నటి)తో ముగిసింది. దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువును కూడా ఆగస్టు 28 వరకు పొడిగించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ibps.in ని విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం, IBPS PO ప్రిలిమ్స్ కాల్ లెటర్‌లను సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.

దరఖాస్తు రుసుము:
SC, ST, PWD దరఖాస్తుదారుల విషయంలో IBPS PO, SO కోసం దరఖాస్తు రుసుము రూ.175. మిగతా అభ్యర్థులందరికీ పరీక్ష రుసుము రూ.850.

➼ ఈ IBPS రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1402 SO ఖాళీలను భర్తీ చేస్తుండగా.. IBPS POకి సంబంధించి పోస్టుల ఖాళీల సంఖ్య 3,049గా ఉంది. IBPS SO 2023 ప్రిలిమ్స్ పరీక్ష డిసెంబర్ 30, డిసెంబర్ 31 తేదీలలో జరుగుతుంది. మెయిన్స్ పరీక్ష జనవరి 28, 2024న ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

➊ : IBPS అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ని విజిట్ చేయండి.

➋ : ‘IBPS PO 2023’ , ‘IBPS SO 2023’ అప్లికేషన్ లింక్‌లపై క్లిక్ చేయండి.

➌ : మీ వివరాలను నమోదు చేయండి తర్వాత లాగిన్ చేయండి.

➍ : దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయండి.

➎ : అవసరమైన పత్రాలను సమర్పించండి, దరఖాస్తు రుసుమును చెల్లించండి.

➏ : ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

➼ ప్రొబేషనరీ ఆఫీసర్ జీతం నెలకు రూ. 52,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రతినెలా రూ.38,000 నుంచి రూ.39,000 వరకు సంపాదించుకోవచ్చు.

BULLET SIGNS CREDIT/ fsymbols 

Advertisment
Advertisment
తాజా కథనాలు