IAS Officer Wife: గ్యాంగ్‌ స్టర్‌ తో పారిపోయిన ఐఏఎస్‌ భార్య!

9 నెలల కిత్రం ఇంట్లో నుంచి ఓ గ్యాంగ్‌ స్టర్ తో పారిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య..ఆమె పై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి మళ్లీ తిరిగి వచ్చింది. అయితే ఆ ఐఏఎస్‌ అధికారి ఆమెను ఇంట్లోనికి రానివ్వకపోవడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

IAS Officer Wife: గ్యాంగ్‌ స్టర్‌ తో పారిపోయిన ఐఏఎస్‌ భార్య!
New Update

IAS Officer Wife: ఓ ఐఏఎస్‌ అధికారి భార్య తొమ్మిది నెలల క్రితం గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయింది. తిరిగొచ్చిన ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ మహిళ జులై 21న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన మహిళ శనివారం గుజరాత్‌ లోని తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది.

అయితే ఆమె గ్యాంగ్‌స్టర్‌ తో కలిసి పిల్లల అపహరణ కేసులో నిందితురాలిగా ఉన్న తన భార్యను ఇంట్లోకి అనుమతించవద్దని ఆమె భర్త తన ఇంటి సెక్యూరిటీ సిబ్బందికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ తన భర్త అధికారిక నివాసానికి ఎదురుగా ఉన్న తోటలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. 45 ఏళ్ల ఆమెను గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిలో చేర్చగా మరుసటి రోజు ఆమె మరణించింది. ఈ జంట 2023లో విడిపోయారు. విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

తొమ్మిది నెలల క్రితం తన సొంత రాష్ట్రంలో ఒక గ్యాంగ్‌స్టర్‌తో మహిళ పారిపోయినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్, అతని సహాయకుడితో పాటు మైనర్‌ను కిడ్నాప్ చేసిన కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. సదరు గ్యాంగ్ స్టర్ ఓ బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ సమయంలో పోలీసులు బాలుడిని కాపాడారు.గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులతో పాటు మహిళ పైనా కిడ్నాప్ కేసు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మహిళ తన భర్త ఐఏఎస్ రంజిత్ కుమార్ దగ్గరికి తిరిగి వచ్చింది. అయితే రంజిత్ ఆమెను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదు.

దీంతో సూసైడ్ నోట్ రాసిన మహిళ పురుగుమందు తాగింది. చికిత్స పొందుతూ ఆమె చనిపోగా.. భార్య మృతదేహాన్ని తీసుకోవడానికి రంజిత్ నిరాకరించారు. ఈ క్రమంలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు ఓ లేఖ కూడా రాసింది. లేఖలో తాను గ్యాంగ్‌స్టర్ ఉచ్చులో చిక్కుకున్నానని, అతను ప్రధాన నిందితుడిగా ఉన్న రెండు క్రిమినల్ కేసులలో తాను కూడా చిక్కుకుపోయానని మహిళ ఆ లేఖలో పేర్కొంది. తన భర్త గొప్ప వ్యక్తి అని, తన పిల్లలను బాగా చూసుకున్నాడని లేఖలో వివరించింది.

Also read: ఎంపీడీవో వెంకట రమణరావు మృతి..అధికారికంగా నిర్థారించిన పోలీసులు!

#gujarat #wife #gangster #ias #officer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe