Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. ట్రైనింగ్‌ను సస్పెండ్‌ను చేసిన యూపీఎస్సీ

వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి పూజా ఖేద్కర్ ట్రైనింగ్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నామని యూపీఎస్సీ(UPSC) ప్రకటించింది. ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి వచ్చి రిపోర్ట్‌ చేయాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను రిలీవ్ చేశారు.

New Update
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్.. ట్రైనింగ్‌ను సస్పెండ్‌ను చేసిన యూపీఎస్సీ

వివాదాస్పద ఐఏఎస్‌ అధికారి పూజా ఖేద్కర్ మరింత చిక్కుల్లో పడింది. ఆమె ట్రైనింగ్‌ను టెంపరరీగా హోల్డ్‌లో పెడుతున్నామని యూపీఎస్సీ(UPSC) ప్రకటించింది. జులై 23లోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి వచ్చి రిపోర్ట్‌ చేయాలని నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో యాపీఎస్సీ ఆదేశాలతో వాషిమ్‌ జిల్లాలోని విధుల్లో ఉన్న పూజా ఖేద్కర్‌ను అధికారులు రిలీవ్ చేశారు. పూజా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యేందుకు నకిలీ దివ్యాంగ ధృవీకరణ పత్రం సమర్పించారని.. ఓబీసీ రిజర్వేషన్‌ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు తన కారుకు అక్రమంగా సైరన్‌, వీఐపీ నంబర్ ప్లేట్, ప్రభుత్వ స్టిక్కర్‌ను వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పూణె నుంచి వాషిమ్ జిల్లాకు బదిలీ చేసింది. పూజాపై వివాదాలు రావడంతో కేంద్రప్రభుత్వం దీనిపై విచారణ చేసేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రైనింగ్‌ను నిలిపివేస్తూ యూపీఎస్సీ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పూజా ఖేద్కర్‌ తల్లిదండ్రులు సైతం పరారీలో ఉన్నారు. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి వాళ్ల కోసం పూణె పోలీసులు వెతుకున్నారు.

Also Read: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం… ఇకపై వారికి 100 శాతం రిజర్వేషన్లు

Advertisment
తాజా కథనాలు