Andhra Pradesh: ఆంధ్రాలో ఐఏఎస్‌, జేసీల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌గా ఎస్.భార్గవిని నియమించారు. వీరితోపాటూ ఆరుగురు జేసీలు కూడా బదిలీ అయ్యారు.

New Update
AP IAS Transfers: ఏపీ లో 62 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు

IAS JC transfers: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం తప్పడం లేదు. ఇటీవలే పెద్ద ఎత్తున ఐపీఎస్ లను బదిలీ చేశారు. తాజాగా మళ్ళీ కొంతమంది ఐఏఎస్‌లను, జేసీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పీఎస్ గిరిశా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌గా ఎస్.భార్గవి, ఫైబర్ నెట్ ఎండీగా కె.దినేశ్ కుఆర్, ప్రణాళికా శాఖ సంయుక్త కార్యదర్శిగా అనంత్ శంకర్, గుంటూరు కార్పొరేషన్ కమిషనర్‌‌గా పి.శ్రీనివాసులను ప్రభుత్వం నియమించింది.

ఇక వీరితో పాటూ పలు జిల్లాల్లో జేసీలను కూడా బదిలీ చేసింది. కర్నూలు జిల్లా జేసీగా బి.నవ్య, అనంతపురం జేసీగా హరిత, తూర్పుగోదావరి జసీగా చిన్న రాయుడు, పశ్చిమ గోదావరి జేసీగా రాహల్ కుమార్ రెడ్డి, విజయనగరం జేసీగా సేదు మధావన్, నెల్లూరు జేసీగా కార్తీక్‌లను నియమించింది.

Also Read:Brazil: బ్రెజిల్‌లో కూలిన విమానం..62 మంది మృతి?

Advertisment