Hyderabad: హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానంలో శుక్రవారం మధ్యాహ్నం సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విమానంకు చెందిన హైడ్రాలిక్ వీల్స్ తెరుచుకోకపోవడంతో.. దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి బేగంపేట విమానశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ విమానంలో పైలట్లతో పాటు.. మొత్తం 12 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ
ఇదిలాఉండగా మరోవైపు.. రాజస్థాన్‌లోని ఇండియన్ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. చివరికి వ్యవసాయ పొలాల్లో దాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళ్లింది. హెలికాప్టర్‌ను పొలాల్లో ల్యాండ్ చేయడంతో దాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరవుతోంది. శుక్రవారం రాజస్థాన్‌లోని జైపూర్‌కు ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ వెళ్తుండగా.. ఒక్కసారిగా ఇంజిన్ చిప్ వార్నింగ్ లైట్ ఆన్ అయ్యింది. దీంతో పైలట్లు అలర్ట్ అయ్యారు.
ఇక చేసేదేమి లేక ముందు జాగ్రత్త కోసం.. దగ్గర్లో ఉన్న పొలాల్లో ల్యాండ్ చేశారు. అయితే కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని భారత సైన్యం వెల్లడించింది. జైపూర్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో దిద్వానా అనే ప్రాంతంలో ఉదయం 10.35 AM గంటలకు ఆర్మీ హెలికాప్టర్ దిగినట్లు పేర్కొంది. అయితే ఆ సమయంలో వీఐపీలు ఎవరూ లేరని పేర్కొంది. అయితే సాంకేతిక లోపాన్ని రిపేర్ చూసిన తర్వాత ఆ హెలికాప్టర్ గమ్యస్థానానికి చేరుకున్నట్లు పేర్కొంది.
Also Read: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు!