BB Patil: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు. By V.J Reddy 01 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి BRS MP BB Patil Joined BJP: లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) పంపారు. తాజాగా ఆయన తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో కారు దిగి కాషాయ జెండా కప్పుకున్నారు. నిన్న (గురువారం) బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వరుస నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలోకి చేరేది అందుకేనట.. ఒక కీలక హామీతో బీజేపీలో చేరారట బీఆర్ఎస్ జహీరాబాద్ (Zaheerabad) ఎంపీ బీబీ పాటిల్. అదేంటంటే తనకు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని ఆయన బీజేపీ హైకమాండ్ ను డిమాండ్ చేయగా.. ఆ స్థానంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువు ఉండడంతో దీనికి బీజేపీ (BJP) అధిష్టానం కూడా ఒకే చెప్పడంతో ఆయన పార్టీలో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని భావించిన కేసీఆర్.. ఈసారి బీబీ పాటిల్ కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో ఆయన పార్టీ మారినట్లు తెలంగాణ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కారు.. సారూ.. పదహారు.. లేనట్టేనా? తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు కొందరు నేతలు. అయితే.. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల రాజీనామాలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇప్పటికే ఇద్దరు సీటింగ్ ఎంపీలు బీజేపీలో చేరగా.. మరికొంత మంది బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ చెప్పే కారు.. సారూ.. పదహారు.. ఈసారి లేనట్టే అని తాజాగా విడుదలైన పలు సర్వేలు చెబుతున్నాయి. మరి ఎంపీ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారో అనే ఉత్కంఠ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉంది. Also Read: బీజేపీ మొదటి లిస్ట్.. తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరే! #bjp #brs-shock #bb-patil #brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి