Infosys Narayana Murthy : వారానికి తొంభై గంటలు పనిచేశా-నారాయణ మూర్తి

తాను వారానికి తొంభై గంటలు పని చేశానంటూ సమర్ధించకున్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి. గతంలో భారత్‌లో యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని నారాయణ మూర్తి అన్నారు. వీటి మీద తీవ్ర దుమారం చెలరేగడంతో ఇప్పుడు మళ్ళీ సమర్ధించుకున్నారు.

New Update
Infosys Narayana Murthy : వారానికి తొంభై గంటలు పనిచేశా-నారాయణ మూర్తి

Infosys CEO : వారానికి 70 గంటలు పని చేయాలంటూ సూచించిన ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి(Infosys CEO Narayana Murthy) వ్యాఖ్యల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు దీనిని సమర్థించగా.. మరికొందరు విమర్శించారు. ముఖ్యంగా ఐటీ(IT) ఉద్యోగుల అయితే మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలు, టెక్ కంపెనీల సీఈఓలు కూడా దీనిపై స్పందిస్తూ వారి వారి అభిప్రాయాల్ని వెల్లడించారు. తాజాగా ఈ అంశంపై.. నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పనివేళలపై గతంలో చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. తాను తొంభై గంటలు పని చేశానంటూ చెప్పుకొచ్చారు.

Also Read:ఆక్షనీర్ గా ఆకర్షిస్తున్న మల్లికా సాగర్..నెట్లో తెగ సెర్చ్ చేస్తున్న జనాలు

పేదరికం నుంచి తప్పించుకునేందుకు మనకు ఉన్న ఏకైక మార్గం కష్టపడి పనిచేయడమే అని నా తల్లిదండ్రులు చిన్నప్పుడే నాకు నేర్పించారు. నా 40 సంవత్సరాల వృత్తి జీవితంలో నేనదే పాటించా. ఉదయం 6.20 గంటలకు ఆఫీసుకు వెళ్లి.. రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చేవాడ్ని. వారానికి 70 గంటలపైనే పనిచేశా. 1994 వరకు మాకు వారానికి 6 పనిదినాలుండేవి. అప్పుడు వారానికి కనీసం 85-90 గంటలు కూడా పనిచేసేవాడ్ని. ఆ కష్టం ఏమాత్రం వృథా కాలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నారాయణ మూర్తి.

కొద్ది రోజుల కిందట ఇన్ఫీ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది రికార్డ్ అనే పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసో‌డ్‌లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువేనని అన్నారు. అందుకే దేశ యువత ఇంకా ఎక్కువ గంటలు శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలా కష్టపడ్డాయో.. భారత యువత కూడా అదే విధంగా శ్రమించాలని చెప్పారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలతో భారత్ పోటీపడాలంటే ఇక్కడి యువత వారానికి 70 గంటలపాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ఉద్యోగ జీవితంలో ఇబ్బందుల్ని లేవనెత్తగా.. ఇంకొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు