Komatireddy Venkata reddy:ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను కానీ తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈరోజు ఆయన నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

New Update
Minister Komatireddy: బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

పదవి మీద ఆశలేదంటూనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఏదో ఒకరోజు సీఎంని అవుతా అంటూ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. 2018లో బీఆర్ఎస్ మాయమాటలు చెప్పి గెలిచిందని కోమటిరెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని నా ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోను అన్నారు కోమటిరెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నాకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించారు. ప్రజల ఆదరణ చూస్తుంటే చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటూ తెగ ఎమోషనల్ అయిపోయారు.  మరోసారి గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలి. నల్లగొండ అభివృద్దే నా ధ్యేయం అని చెప్పారు. నల్గొండ జిల్లా ఆర్డీవో కార్యాలయంలో కోమటిరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి నామినేషన్ ను అధికారులకు ఇచ్చారు.

Also Read:కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తమ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు కోమటిరెడ్డి. పోలింగ్ కు ముందు రైతు బంధు వేస్తారని, దాన్ని చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని, ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా పనిచేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడు.  నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. రైతులు ఆత్మహత్య చేసుకున్నా రుణమాఫీ చేయడం లేదు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారి ఇంటికి వెళ్లి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులకు ,విద్యార్థులకు బతికున్నప్పుడు అందని సహాయం చనిపోయినప్పుడు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులకు రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు చేపడితే వారి ఆత్మహత్యలు ఉండేవి కావని అన్నారు. టిఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.

Also Read:ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్

Advertisment
Advertisment
తాజా కథనాలు