దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కొన్ని స్థానాల్లో ఆసక్తి నెలకొంది. అయితే హిమాచల్ ప్రదేశ్లో మండీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా.. నటి కంగనా రౌనత్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. నటిగా తనకు అనేక జాతీయ అవార్డులు, పద్మ అవార్డులు వచ్చినా కూడా.. రాబోయే కాలంలో మండీ ప్రాంత అభివృద్ధే తనకు ముఖ్యమని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాను కృషి చేస్తానని చెప్పారు. తనకు 'ఎంపీ ఆఫ్ ద ఇయర్ అవార్డు' వస్తే చాలా సంతోషిస్తానని అన్నారు.
Also read: బీ ఎలర్ట్.. ఏలియన్స్ వచ్చేశాయ్.. కలకలం రేపుతున్న నీలిరంగు కాంతి
అలాగే భవిష్యత్తులో ఏదైన మంత్రిత్వ శాఖ లేదా పెద్ద పదవి తనకు అప్పగిస్తే బాధ్యతగా నెరవేరుస్తానని చెప్పారు. యాపిల్ పండించే రైతుల గురించిన మాట్లాడిన కంగనా.. వాళ్ల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. యాపిల్ ధరల పెంపు తదితర అంశాలపై అధికార యంత్రాంగంతో చర్చించాల్సి ఉందని అన్నారు. ఇక ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని.. కొత్త సినిమా ఎమర్జెన్సీ త్వరలోనే విడుదల అవతుందని వెల్లడించారు.
Also read: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు