UFO: బీ ఎలర్ట్.. ఏలియన్స్ వచ్చేశాయ్.. కలకలం రేపుతున్న నీలిరంగు కాంతి స్పెయిన్‌లో ఆకాశంలో ఒక నీలిరంగు కాంతిని చాలామంది చూశారు. రాత్రి సమయంలో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చిన ఈ కాంతిని కొందరు UFO అని అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదు ఇది కేవలం ఒక ఉల్క అని కొట్టిపడేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. By KVD Varma 19 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి UFO: గ్రహాంతర వాసుల గురించి వింటూనే ఉన్నాం. ఎప్పటి నుంచో ఎక్కడో అక్కడ వీటికి సంబంధించిన కథలు వినిపిస్తూనే వస్తున్నాయి. గ్రహాంతర వాసులు- UFOల గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ వాదనలు ఉన్నాయి. కొంతమంది గ్రహాంతరవాసులు ఉన్నారని, వారు సుదూర విశ్వంలో ఎక్కడో నివసిస్తున్నారని నమ్ముతారు. కానీ, వారి ఆచూకీ మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. అయితే కొంతమంది ఈ విషయాలను కేవలం వదంతులుగా కొట్టి పారేస్తారు. అయితే, ఎప్పుడైనా ఏదో ఒక రహస్యమైన కాంతి లేదా ఏదైనా రహస్యమైన వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తే, అది గ్రహాంతరవాసులకు సంబంధించింది ఏమో అని అంతా అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అలాంటి దృశ్యం కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Also Read: ఇప్పుడు AI టెక్నాలజీ తో క్యాన్సర్ కు చికిత్స UFO: వాస్తవానికి, పోర్చుగల్ - స్పెయిన్‌లో ఆకాశంలో ఒక రహస్యమైన నీలిరంగు కాంతి కనిపించింది అక్కడ చాలా మంది ఈ కాంతిని చూశారు. దానిని వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో రాత్రి సమయం కావడం, రోడ్డుపై వాహనాలు వస్తూ పోతూ ఉండడం, ఇంతలో ఆకాశం నుంచి భూమిపైకి ఏదో పడిపోవడం కనిపించింది. ఆ నిగూఢమైన విషయం భూమి వైపుకు రావడంతో, దాని కాంతి ప్రకాశవంతంగా మారింది. ఒక సెకను మొత్తం ఆకాశాన్ని కాంతితో నింపింది. UFO: ఇప్పుడు ఈ మిస్టీరియస్ లైట్ ఏంటి అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 'వీడియోలో కనిపిస్తున్న ఈ మర్మమైన వస్తువు బోలైడ్' అని కొందరు చెబుతున్నారు. బోలైడ్ నిజానికి ఒక రకమైన ప్రకాశవంతమైన ఉల్క, ఇది వాతావరణంలో పేలుతుంది' అని అంటున్నారు. కొంతమంది మాత్రం 'అది గ్రహాంతర వాసి. హాయ్ చెప్పడానికి భూమికి వచ్చాడు.’ అని చాలామంది సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. UFO: ఈ షాకింగ్ వీడియో @dom_lucre అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది. కేవలం 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 మిలియన్ల మంది అంటే 50 లక్షలకు పైగా వీక్షించగా, 48 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. 🔥🚨BREAKING: An unknown object just flashed across the sky in Portugal pic.twitter.com/lshlt5J24m — Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) May 19, 2024 #spain #ufo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి