Samantha : నా క్యారెక్టర్ పై అందరికీ అనుమానమే.. సామ్ కామెంట్స్ వైరల్! 'రంగస్థలం' సినిమాలో రామలక్ష్మీ పాత్ర పోషించడంపై మొదట ఆందోళన చెందినట్లు సమంత చెప్పింది. డీగ్లామర్ క్యారెక్టర్ లో తనను జనాలు అంగీకరిస్తారో లేదోనని దర్శకనిర్మాతలు సైతం అనుమానం వ్యక్తం చేసినట్లు చెబుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. By srinivas 27 Feb 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Rangasthalam : స్టార్ నటి సమంత(Samantha) ‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలో తాను పోషించిన రామలక్ష్మి పాత్ర గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి గ్లామర్ రోల్స్ చేసిన తాను.. డీగ్లామర్ క్యారెక్టర్ లో కనిపించాలని మేకర్స్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) యాక్సెస్ట్ చేస్తారో లేదోనని.. ఈ మేరకు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్(Ram Charan) హీరోగా వచ్చిన ఈ సినిమా బిగ్ హిట్ అయిన విషయం తెలిసిందే. కాగా సామ్.. ఇందులో రామలక్ష్మి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే తాను సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 14ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. ‘రామలక్ష్మి’ పాత్ర కోసం సమంతను తీసుకోవాలని చిత్ర బృందం మొదట భావించలేదని చెప్పింది. సమంతను పల్లెటూరు అమ్మాయిగా ప్రేక్షకులు యాక్సెస్ట్ చేస్తారో లేదోనని మేకర్స్ ఆందోళ చెందినట్లు చెప్పింది. అంతేకాదు ఈ క్యారెక్టర్ గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని, తన కెరీర్ కు దెబ్బ పడుతుందని కూడా కాస్త భయాందోళనకు గురైనట్లు చెప్పింది. ఇది కూడా చదవండి: Lok Sabha: రాహుల్ గాంధీ పోటీపై ఉత్కంఠ వీడినట్లేనా? ''రంగస్థలం' సినిమాతోపాటు రామలక్ష్మి(Rama Lakshmi) క్యారెక్టర్ నాకు ఎంతో గుర్తింపు ఇచ్చింది. డీగ్లామర్ క్యారెక్టర్ లో నేను నటిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా ? ఇప్పటివరకూ గ్లామర్ పాత్రల్లో కనిపించిన సమంతను ఓ పల్లెటూరు మాస్ అమ్మాయిగా చూపిస్తే అభిమానులు ఏమనుకుంటారోనని దర్శకనిర్మాతలు కంగారుపడ్డారు. కానీ సుకుమార్ సర్ మాత్రం నాపై నమ్మకం ఉంచారు. నిజంగా రామలక్ష్మి పాత్ర చేసే అవకాశం దక్కడం నేను లక్కీగా ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది. #samantha #tollywood-actress #rangasthalam #rama-lakshmi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి