Animal Actress : ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ!

యానిమల్‌ సెకండ్‌ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్‌ భామ త్రిప్తి దిమ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. టాలీవుడ్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తో నటించాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.

Animal Actress : ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ!
New Update

Animal Actress Tripti Dimri : యానిమల్‌(Animal) సినిమా విడుదలైన తరువాత అందులో నటించిన హీరోయిన్‌ రష్మిక (Rashmika) కంటే మరో హీరోయిన్‌ కి బాగా పాపులారిటీ వచ్చింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్‌ నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) . సినిమా చూసిన వారంతా కూడా ఆమె గురించి చెప్పుకున్నారంటే అతిశయోక్తి కాదు. తన నటన, అందంతో కట్టిపడేసింది త్రిప్తి.

ఈ మూవీతో త్రిప్తి రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. దీంతో త్రిప్తికి వరుస పెట్టుకుని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే జూనియర్‌ ఎన్టీఆర్ (Jr. NTR) గురించి తన మనసులో మాట చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సౌత్‌ లో ఏ స్టార్‌ హీరోతో నటించాలని ఉందని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌ తో నటించాలని ఉందని చెప్పింది.

ఆయనతో కలిసి తెరను పంచుకోవాలనుకుంటున్నట్లు ఆమె వివరించింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి. యానిమల్ లో చేసిన తరువాత ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె తెగ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందుకు 6 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 3.6 మిలియన్లకు చేరింది.

జూనియర్ ఎన్టీఆర్‌ ఆర్ఆర్‌ఆర్‌ సినిమా తరువాత ప్రస్తుతం దేవర్‌ సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీబిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్‌ సీఈవో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే.

Also read: అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు!

#animal #tollywood #viral #triptidimri #movies #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి