Team India : రోహిత్ టీ20 వరల్డ్ (T20 World Cup) కప్పు అందుకోవడం... టీమ్ సంబరాలు చేసుకోవడం అయ్యాక విరాట్ కోహ్లీ (Virat Kohli)... టీ 20 ప్రపంచకప్‌ను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు అందించాడు. ఆటగాళ్లంతు చుట్టూ చేరి చూస్తుండగా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) కప్పు పైకెత్తి విజయ గర్జన చేశాడు. దీనికోసమే కదా ఇన్నేళ్లు శ్రమపడ్డది అనేలా టీమిండియా హెడ్ కోచ్ ఆ క్షణాలను భావోద్వేగంతో ఆస్వాదించాడు. గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. దీని కోసమే కదా ఇన్నాళ్ళు నిరీక్షించాను అన్న ఎమోషన్ అతనిలో అప్పుడు కనిపించింది. ఆ తర్వాత టీమ్ ఆటగాళ్ళు అంతా కోచ్ ద్రావిడ్‌ను గాల్లోకి ఎగురేస్తూ తమ కృతజ్ఞతను తెలియజేశారు. కోచ్‌గా అతనికివ్వాల్సిన గౌరవాన్ని ఆనందంగా చాటుకున్నారు.
ఇదంతా అయిపోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ (Rohit Sharma) తో పాటూ కోచ్ ద్రావిడ్ కూడా మిడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ఈ ఆనందం నుంచి తేరుకుని ముందుకు సాగాలి. అయితే, వచ్చేవారం నుంచి నా జీవితంలో పెద్దగా మార్పేమీ ఉండదు అంటూ చెప్పారు. దీని తర్వాత ఏం చేయాలో కూడా ఇంకా ఆలోచించలేదని అన్నారు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత తన తదుపరి కార్యాచరణ ఏంటనేది నిర్ణయించుకుంటానని తెలిపారు. అలా అన్న తర్వాత ఇప్పుడు తాను నిరుద్యోగిని అని..మీ దగ్గర ఏమైనా మంచి ఆఫర్లు ఉంటే చెప్పండి అంటూ జర్నలిస్టులతో సరదాగా ముచ్చటించారు. రాహుల్ ద్రావిడ్ ఈ సింప్లిసిటీ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.
Also Read:National: ఎట్టకేలకు ఎంపీగా రషీద్ ప్రమాణ స్వీకారం- అనుమతించిన ఎన్ఐఏ