Telangana: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హైడ్రాలో మరిన్ని పోస్టులు హైడ్రాలో అదనపు సిబ్బందిని రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైడ్రా కోసం 3500 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు మరిన్ని పోస్టులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. By B Aravind 30 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా మరింత దూకుడు పెంచనుంది. ఇందుకోసం అదనపు సిబ్బందిని రిక్రూట్‌మెంట్ చేసుకునే పనులు వేగవంతం చేస్తోంది. ఇప్పటికే హైడ్రా కోసం 3500 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రిపోర్టు ఇచ్చారు. ఇందులో ఇప్పటికే 259 మంది పోలీస్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో ఆ పోస్టులను హైడ్రా ఫైనల్ చేసింది. గురువారం సీఎం రేవంత్.. రంగనాథ్‌తో పాటు ఇతర అధికారులుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు మరిన్ని పోస్టులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. Also Read: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా? వీటిలో HMDA, GHMC, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు విభాగల నుండి ఆయా సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకోనున్నారు. అలాగే హైడ్రా పరిధిని 3 జోన్లుగా విభజించి ఆయా జోన్ల వారిగా అధికారులు పనిచేయనున్నారు. #cm-revanth #telugu-news #telangana #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి