HYDRA: బఫర్ జోన్‌లో ఓవైసీ కాలేజీలు.. కూల్చివేతకు సిద్ధమవుతున్న హైడ్రా హైదరాబాద్‌లో సలకం అనే చెరువు బఫర్ జోన్‌లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా వాటిని హైడ్రా కూల్చివేయొచ్చని సమాచారం. By B Aravind 27 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సలకం అనే చెరువు బఫర్ జోన్‌లో ఓవైసీ కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫాతిమా కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు సమాచారం. పూర్తిగా చెరువును కబ్జా చేసి భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇవి ముమ్మాటికీ ఆక్రమణలే అని హైడ్రా అధికారులు చెబుతున్నారు. సకలం చెరువు బఫర్ జోన్‌లో 12 అతిపెద్ద భవనాలు నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏ క్షణంలోనైనా ఆ భవనాలను హైడ్రా కూల్చివేయొచ్చని తెలుస్తోంది. Also Read: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్ పరీక్షకు ప్రణాళిక ఖరారు! ఆ భవనాలను పరిశీలించి ఇప్పటికే అధికారులు నివేదిక ఇచ్చారు. గంటల వ్యవధిలోనే పని పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు ఓవైసీ బ్రదర్స్, మజ్లిస్ క్యాడర్ యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకోసం హైడ్రా అధికారులు అదనపు బలగాలను మోహరించి కూల్చివేసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే కూల్చివేతలపై బధువారం కోర్టుకు వెళ్లాలని ఓవైసీ బ్రదర్స్ యోచిస్తున్నారు. మరోవైపు ఓవైసీ బ్రదర్స్ నుంచి సకలం చెరువును కాపాడాలని ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. Also Read: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ #hydra #telugu-news #asaduddin-owaisi #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి