Hyderabad Woman Murdered In Australia: ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన శ్వేత దారుణ హత్యకు గురైంది. విక్టోరియా బక్లీ దగ్గరలోని అడవుల్లో చెత్త బుట్టలో శ్వేత శవం దొరికింది. మొదట ఈమెది అనుమానాస్పద మృతిగా భావించారు. కానీ ఇప్పుడు అది హత్య అని తేలింది. అది కూడా ఆమె భర్తే హత్య చేశాడని నమ్మలేని నిజం వెలుగులోకి వచ్చింది. శ్వేత భర్త అశోక్‌రాజ్ ఇంట్లోనే శ్వేతను హత్య చేసి...ఆ తరువాత ఆమె శవాన్ని చెత్తబుట్టలో కుక్కి..దగ్గరలోని అడవుల్లో వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు పక్కన ఉన్న ఆ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. శ్వేత భర్త అశోక్‌రాజ్ హత్య చేసిన తర్వాత నాలుగేళ కొడుకుని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. పిల్లాడిని అమ్మమ్మ, తాతయ్యల దగ్గర వదిలేశాడు. తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళే ముందు తానే శ్వేతను హత్య చేశానని చెప్పి మరీ వెళ్ళాడు. అక్కడ ఆస్ట్రేలియాలో శ్వేత హత్య మీద దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు కూడా ఆమె భర్త అశోక్‌రాజే హత్య చేశాడని తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యభర్తల మధ్య మనస్పర్ధలఏ హత్యకు కారణమని తెలుస్తోంది. శ్వేత, అశోక్‌రాజ్‌కు హైదరాబాద్‌లోనే పరిచయం ఉంది. పెళ్ళికి ముందే ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళారు. కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ 2017లో పెళ్ళి అయింది. కొన్నాళ్ళు బాగానే ఉన్న శ్వేత, అశోక్‌రాజ్‌లు తరువాత మనస్పర్ధల కారణంగా తరుచూ కొట్టుకునే వారు. హత్య జరిగిన రోజు కూడా వారిద్దరూ గొడవ పడ్డారు. అందులో భాగంగానే ఆవేశం ఆపుకోలేక అశోక్ తన భార్య శ్వేత గొంతును నులిమాడు. ఈ ఘటనలోనే శ్వేత చనిపోయింది. ఆమె పోయాక ఏం చేయాలో అశోక్‌కు తెలియలేదు. అదీకాక నాలుగేళ్ళ కొడుకు అక్కడే ఉన్నాడు. దీంతో శవాన్ని ఇంట్లోనే ఉన్న పెద్ద చెత్త బుట్టలో పెట్టాడు. ఆ తరువాత దాన్ని తీసుకుని దగ్గరలోని అడవుల్లోకి వెళ్ళి అక్కడ వదిలేశాడు. వెంటనే కొడుకు తీసుకుని ఇండియాకు వచ్చేశాడు.
మరోవైపు ఆస్ట్రేలియాలో మృతి చెందిన శ్వేత మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ నగరానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోనూ మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అక్కడ శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసినట్లు సమాచారం ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.
Also Read:Movies: మీ పిచ్చి తగలెయ్య..హీరోల కోసం మీరెందుకు కొట్టుకుంటున్నార్రా..