Zero Shadow Day: హైదరాబాద్‌లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మిట్టమధ్యహ్నం సమయంలో కనిపించే మన నీడ మాయమవుతుంది. సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో ఎండలో నిటారుగా నిలబడినా లేదా ఏదైనా వస్తువులను పెట్టిన వాటి నీడ కనిపించదు. ఇలా ఏడాదికి రెండుసార్లు జీరో షాడో డే జరుగుతుంది. అయితే ఈ జీరో షాడో డే.. గురువారం మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు.
Also Read: మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
ఒకవేళ మోఘాలు కమ్ముకుని వర్షం పడితే ఈ జీరోషాడో కనిపించే అవకాశం ఉండదన్నారు. జీరో షాడో డే వస్తే ఔత్సాహికులు తమ ఫొటోలను birlasc@gmail.com కు పంపించాలని సూచించారు. అయితే ఈ జీరో షాడోను రెండు, మూడు రోజుల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు చూడొచ్చని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ చెప్పారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బుధవారం జీరో షాడో ఎలా మారుతుందో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా కూడా వివరించినట్లు తెలిపారు.
Also Read: నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన