Hyderabad: హైదరాబాద్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. ఏపీ నాయకులకు తెలంగాణ నేతలు వార్నింగ్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెండు రాష్ట్రాలు బాగుండాలి. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకోండి. రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దు' అని హెచ్చరించారు. By srinivas 13 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి (Subbareddy), మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే.. ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని.. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి.. కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు. ఇది కూడా చదవండి : Huma Qureshi: ‘యానిమల్’ నాకు బాగా నచ్చింది.. చూసినంతసేపు అదే ఫీలింగ్ కలిగింది! సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకే.. హైదరాబాద్ జోలికి వస్తే ఊరుకోబోమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ఎవరి పాలన వాళ్లు చేసుకుంటున్న సమయంలోఈ ప్రతిపాదన మంచిదికాదన్నారు. ఉమ్మడి రాజధాని కామెంట్స్‌పై తెలంగాన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు తెరమీదకి తెస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్, కేసీఆర్ లబ్ధి కోసమే మొన్నటిదాకా కేఆర్‌ఎంబీ అంశం.. ఇప్పుడు ఉమ్మడి రాజధాని అంశంతో మళ్లీ సెంటిమెంట్ రాజేస్తున్నారని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. ఇంకా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఉంటుందనుకోవడం మూర్ఖత్వమని, పదేళ్ళలో ఏపీ రాజధాని ఏర్పాటు చేసుకోవడంలో అక్కడి రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని అద్దంకి దయాకర్ విమర్శించారు. #brs #ts-congress #hyderabad-as-joint-capital #yv-subbareddy #peddireddy-ramachandra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి