Hyderabad: హైదరాబాద్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. ఏపీ నాయకులకు తెలంగాణ నేతలు వార్నింగ్
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెండు రాష్ట్రాలు బాగుండాలి. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకోండి. రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దు' అని హెచ్చరించారు.