hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం

మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్‌ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు.

New Update
hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం

మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్‌ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. వారికోసం హోటళ్లలో గదులు బుక్ చేయడంతో పాటు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (నేడు) ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో వస్తున్నారు. ఈ క్రమంలో భాగ్యనగరంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ పోస్టర్లు వెలిశాయి. రేవంత్‌రెడ్డి ఫొటోతో ఈ పోస్టర్లు టీకాంగ్రెస్‌ నేతల్లో కలకలం సృష్టిస్తోంది.

రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు వెలిశాయి. ఈ పోస్టర్లలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,రాహుల్‌గాంధీలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా కీలక నేతల ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల ఉన్న కీలక నేతలు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కామ్‌ల వివరాలను ముద్రించారు. అంతేకాదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే సహా మొత్తం 24 మంది సీడబ్ల్యూసీ సభ్యుల పేర్లు, పోస్టర్లపై ఫొటోలు ఉన్నాయి. ఫొటోల కింద బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ హెచ్చరికలను ముద్రించారు. ఈ హెచ్చరికల పక్కనే వైఎస్ఆర్ అన్న అక్షరాలు కూడా పెట్టారు. ఈ పోస్టర్లను ఎవరు ముద్రించారు..? గోడలపై అతికించింది ఎవరు..? అనే వివరాలు తెలియల్సింది.

బంజారాహిల్స్‌లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం సృష్టిస్తోంది. సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు, అని గతంలో అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం ఇచ్చాయి. ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్‌లపై టీకాంగ్రెస్‌లో సర్వత్రా చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలను ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు బలి దేవత, ముద్దపప్పు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డినే ఇవాళ తెలంగాణ తల్లి అంటూ స్వాగతం పలకడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ముక్కునవేలు వేసుకుంటున్నారు.

Posters with Revanth Reddy photo are scattered in Banjara Hills

పోస్టర్లలో ఉన్న వారిలో ప్రధానంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనిల ఫొటోల కింద నేషనల్ హెరాల్డ్ స్కామ్, దిగ్విజయ్ సింగ్ ఫొటో కింద రిక్రూట్‌మెంట్ స్కామ్, మీరా కుమార్ ఫొటో కింద ఎన్ హెచ్ఏ స్కామ్, చిదంబరం ఫొటో కింద ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కామ్‌, మన్మోహన్ సింగ్ ఫొటో కింద కోల్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరాలు ఉన్న పోస్టర్లు ఉన్నాయి. మిగతా నేతల ఫొటోల కింద కూడా వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపించిన స్కామ్‌ల వివరాలను ముద్రించి అతికించారు. ఈ పోస్టర్లు టీకాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

Posters with Revanth Reddy photo are scattered in Banjara Hills

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు