Telangana : లోక్‌సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో ఆంక్షలు

ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు.

New Update
Telangana : లోక్‌సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో ఆంక్షలు

Lok Sabha Elections : తెలంగాణలో(Telangana) ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌(Hyderabad)లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ.. మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. అలాగే పోలింగ్ రోజున పోలింగ్ సెంటర్ల వద్ద 200 మీటర్ల పరిధిలో 11 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్క1న్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురికి మించి గుమికూడొద్దని చెప్పారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు.

Also Read: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..

ఏ లైసెన్సు కింద పర్మిషన్ ఉన్నప్పటికీ మద్యం విక్రయాలపై ఆంక్షలు ఉంటాయని తెలిపారు. 13న పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు(Voters) రెండు క్యూ లైన్‌లలో నిలబడాలని తెలిపారు. మహిళల, పురుషులకు వేరువేరుగా క్యూ లైన్లు ఉంటాయని.. రెండు కంటే ఎక్కువ లైన్లకు అనుమతించబోమని పేర్కొన్నారు. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమన్నారు. ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మరణాయుధాలు వినియోగించారని చెప్పారు. ఎవరైనా రూల్స్ పాటించకుంటే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: కేటీఆర్‌ రాళ్ల దాటి ఘటన.. 23 మంది అరెస్టు

Advertisment
తాజా కథనాలు