Telangana : డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్‌ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌ నూతన సీపీగా నియామితులైన కొత్తపేట శ్రీనివాస్‌ రెడ్డి వచ్చి రాగానే డ్రగ్స్‌ ముఠాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణతో సహా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించే లక్ష్యం దిశగా పనిచేస్తామని వెల్లడించారు. డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకొని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు.

New Update
Telangana : డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్‌ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి

CP Srinivas Reddy : హైదరాబాద్ కొత్త సీపీగా బాధ్యతలు చేపట్టిన కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) డ్రగ్స్‌ ముఠాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న డ్రగ్స్ ముఠాలు ఇక ప్యాకప్ చేసుకొని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. తెలంగాణతో సహా హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని.. డ్రగ్స్ వినియోగం లేకుండా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అలాగే డ్రగ్స్‌కు సంబంధించి ఒకసారి సినీ ఇండస్ట్రీ వారితో కూడా సమావేశం పెడతామని.. అయినా కూడా వారు మారకపోతే.. ఉక్కపాదం మోపుతామంటూ హెచ్చరించారు. అలాగే నగరంలోని రెస్టారెంట్లు, పబ్స్‌పై కూడా 24 గంటలు నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

Also Read: అయ్యప్ప భక్తులకు గుడ్‌ న్యూస్‌..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు!

అలాగే పార్టీల పేరుతో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే.. వదిలే ప్రసక్తే లేదని.. డ్రగ్స్‌ను నిర్మూలించే లక్ష్యం దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైందని.. అందరితో ఫ్రెండ్లీగా ఉంటే అది పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే నష్టం అని అన్నారు. చట్టాన్ని గౌరవించేవారితో తాము స్నేహంగానే ఉంటామని.. కానీ చట్టాలను ఉల్లంఘించే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మహిళ వేధింపులు, ర్యాగింగ్ లు జరగకుండా  షీ టీమ్స్ ద్వారా పని తీరును మరింత  మెరుగుపరుస్తామని వెల్లడించారు. తన శక్తి సామర్థ్యాలు గుర్తించి తనకు హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు