హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతి శుక్రవారం కూడా రాత్రికి 11.45 PM గంటల వరకు.. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 AM గంటల నుంచే రైళ్ల రాకపోకలు నిర్వహించేలా.. ట్రయల్ నిర్వహిస్తున్నామని ఇటీవలే అధికారులు ప్రకటన చేశారు.
Also read: బిడ్డ లింగం తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన దుర్మార్గుడు!
ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే తాజాగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. నగరంలో మెట్రో ప్రయాణానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రోలో రద్దీ ఉంటుంది.
Also Read: గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్