Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మెహ్‌ఫిల్‌ రెస్టారెంట్‌కు చెందిన చికెన్‌ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ కస్టమర్ ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా క్షమాపణ చెప్పి రూ.64 మాత్రమే రిఫండ్ చేసిందన్నాడు. మెహ్‌ఫిల్‌ నుంచి ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయొద్దని కస్టమర్లకు సూచించాడు.

Telangana : చికెన్ బిర్యానీలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
New Update

Chicken Biryani Order : ఈ మధ్య బయట హోటళ్లు, రెస్టారెంట్ల లో తినే ఫుడ్‌లో పురుగులు, బల్లి, జెర్రి లాంటివి కనిపించడంతో కస్టమర్‌లు షాకవుతున్నారు. తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ (Hyderabad) లోని కూకట్‌పల్లిలో మెహ్‌ఫిల్‌ రెస్టారెంట్‌ (Mehfil Restaurant) కు చెందిన చికెన్‌ బిర్యానీలో పురుగు వచ్చినట్లు ఓ వినియోగదారుడు ఎక్స్‌లో షేర్ చేశాడు. స్విగ్గీలో చికెన్ బిర్యానీ (Chicken Biryani) ఆర్డర్ చేశానని.. అది తింటుండగా పురుగు కనిపించినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని స్విగ్గీ (Swiggy) కి ఫిర్యాదు చేయగా.. క్షమాపణ చెప్పి రూ.64 రిఫండ్ చేసినట్లు తెలిపాడు. అయితే తాను ఆర్డర్ చేసిన బిర్యానీకి మాత్రం రూ.318 ఖర్చైందని.. మెహ్‌ఫిల్‌ నుంచి ఎవరూ ఆహారం ఆర్డర్ చేయొద్దని నెటీజన్లకు సూచించాడు.

Also Read: చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడు.. ఊరంతా షాక్

#telugu-news #chicken-biryani #worms #swiggy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe